Oscars 2023: ఇండియాకు తొలి ఆస్కార్, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ అవార్డు

Oscars 2023: ఇండియా గర్వపడింది. భారతదేశానికి తొలి ఆస్కార్ వరించింది. ప్రపంచ ప్రసిద్ధ సినిమాలతో పోటీ పడి భారతదేశ సినిమా ఆస్కార్ గెల్చుకుంది. ఇండియాకు ఇప్పటి వరకూ లభించిన ఇదే తొలి ఆస్కార్ అవార్డు. పూర్తి వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 13, 2023, 09:36 AM IST
Oscars 2023: ఇండియాకు తొలి ఆస్కార్, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్  అవార్డు

భారతదేశం గర్వపడే సమయం. చలనచిత్ర పరిశ్రమలో ఇండియాకు గుర్తింపు వచ్చింది. భారతదేశ సినిమా తొలి ఆస్కార్ అవార్డు గెల్చుకుంది. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగరీలో The Elephant Whisperers సినిమా ఆస్కార్ సాధించింది. ఇండియాకు ఇదే తొలి ఆస్కార్ అవార్డు. 

కార్తీక్ గొంజాల్వేస్ దర్శకత్వం వహించిన ఈ షార్ట్ ఫిల్మ్ ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయింది. The Elephant Whisperers, Haulout, How Do You Measure a Year, The Martha Mitchell Effect, Stranger at the Gate వంటి సినిమాలతో పోటీపడి మరీ ఆస్కార్ కైవసం చేసుకుంది. 

ఈ సినిమాను కార్తీకి గోన్సల్వేస్, గున్‌పీత్ మోంగా, డౌగ్లస్ బ్లష్ నిర్మించారు. ఈ షార్ట్ ఫిల్మ్ ఇండో అమెరికన్ జాయింట్ వెంచర్‌తో నిర్మింపబడింది. శిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తీసిని సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమ్ అవుతూ అందరి ప్రశంసలు అందుకుంది. మరోవైపు ఈ షార్ట్ ఫిల్మ్ డాక్ న్యూయార్క్ అవార్డు, హాలీవుడ్ మ్యూజిక్ ఇన్ మీడియా అవార్డు, ఐడీఐ డాక్యమెంటరీ అవార్డుల్ని దక్కించుకుంది. రఘు అనే ఓ ఏనుగును అక్కున చేర్చుకుని ఆదరించిన బొమ్మన్, జెల్లి జంటకు, ఏనుగుకు మధ్య ఏర్పడే బలమైన అనుబంధాన్ని సహజత్వాన్వి చక్కగా చిత్రీకరించారు. ప్రకృతికి అనుగుణమైన గిరిజనుల జీవితాన్ని చాలా అందంగా చూపించారు. 

Also read: Oscars 2023 Live Updates: ఆస్కార్ విజేతల జాబితా.. మరోసారి హిస్టరీ క్రియేట్ చేసిన బ్లాక్ మహిళ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News