OTT Releases This Week in Telugu : ఈ వారం పెద్ద సినిమాలు ఏవీ థియేటర్లలోక్ రావడం లేదు, అలా అని ఓటీటీలోకి కూడా రావడం లేదు. ఓటీటీలోకి రావాల్సిన బడా సినిమాలు కూడా ఇప్పటికే వచ్చేయడంతో ఈవారం ఓటీటీలోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయి అనే విషయం మీద ఆసక్తి నెలకొంది. ఈ వారం తెలుగులో పెద్దగా ఆసక్తి రేకెత్తించే సినిమాలు ఏమీ లేవు. అన్నీ చిన్న సినిమాలే అది కూడా ఒక మాదిరి సినిమాలైతే విడుదలవుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నెట్ ఫ్లిక్స్ విషయానికి విషయానికి వస్తే తలైకోతల అనే తమిళ సినిమా మార్చి మూడవ తేదీన విడుదలవుతోంది. అలాగే ఇరాటా అనే మలయాళ సినిమా కూడా మార్చి మూడవ తేదీని విడుదలవుతుంది. ఇక బుట్ట బొమ్మ అనే తెలుగు సినిమా మార్చి 4వ తేదీన అదే నెట్ ఫ్లిక్స్ లో  విడుదలవుతోంది.


ఇక ఆహా వీడియో యాప్ లో బాబీ సింహా ప్రధాన పాత్రలో నటించిన వసంత కోకిల సినిమాని తెలుగులో డబ్బింగ్ చేసి మార్చి మూడో తేదీ విడుదల చేస్తున్నారు. అదే విధంగా ఇక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ విషయానికి వస్తే హిందీలో గుల్మోహార్ అనే సినిమా మార్చి మూడవ తేదీన విడుదలవుతోంది. మార్చి 4వ తేదీన ఎలోన్ అనే  ఒక మలయాళ మూవీ విడుదలవుతోంది.


జి ఫైవ్ విషయానికి వస్తే డివైడెడ్ బై బ్లడ్ అని ఒక హిందీ వెబ్ సిరీస్ మార్చి 3వ తేదీ విడుదలవుతోంది. ఇక మార్చి మూడో తేదీన ది గ్రేట్ ఇండియన్ కిచెన్ అనే తమిళ సినిమా రిలీజ్ అవుతుంది. గతంలో మలయాళం లో తెరకెక్కి  సూపర్ హిట్ గా నిలిచిన ది గ్రేట్ ఇండియన్ కిచెన్ సినిమాకి ఇది తమిళ రీమేక్ గా రూపొందించినట్లుగా చెబుతున్నారు.
Also Read: Dvv Daanayya Missing: డీవీవీ దానయ్య ఎక్కడ.. ఆర్ఆర్ఆర్ అవార్డులు కూడా అందుకోలేనంత బిజీనా?


Also Read: Jr NTR Unhappy: హెచ్సీఏ వ్యవహారంలో ఎన్టీఆర్ అసహనం.. రంగంలోకి జక్కన్న!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి