పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా షూటింగ్‌కి ( Vakeel Saab shooting ) ఏ రోజు నుండి హాజరుకాబోతున్నాడు అనే అప్‌డేట్ వచ్చేసింది. కరోనావైరస్ ( Coronavirus ) లాక్ డౌన్ కారణంగా 7 నెలలకు పైగా విరామం తీసుకున్న తరువాత, పవన్ కళ్యాణ్ అక్టోబర్ 23 నుంచి వకీల్ సాబ్ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాలీవుడ్‌లో బాగా ప్రశంసలు అందుకున్న 'పింక్' సినిమా రీమేకే వకీల్ సాబ్ చిత్రం అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. హిందీ వెర్షన్‌లో అమితాబ్ బచ్చన్ పోషించిన న్యాయవాది పాత్రలో పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) నటిస్తున్నాడు. అభిమానులలో, అలాగే ట్రేడ్ వర్గాలలో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. Also read : Prabhas birthday gift: బర్త్ డే గిఫ్టుపై ప్రభాస్ పోస్ట్


వకీల్ సాబ్‌ సినిమాలో అంజలి, నివేదా థామస్, అనన్య నాగల్ల ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. పవన్ కళ్యాణ్ సరసన మరోసారి శృతిహాసన్ ( Shruti Haasan ) జోడి కడుతోంది. శ్రీరాం వేణు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ ( SS Thaman ) అందిస్తున్నాడు.


లాక్‌డౌన్‌కి ముందే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. కొన్ని కోర్టు సీన్స్ అలాగే క్లైమాక్స్ ఫైటింగ్ సీన్స్ పవన్ కల్యాణ్‌పై చిత్రీకరించనున్నారు. వకీల్ సాబ్ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ మరో మూడు సినిమాలకు సైన్ చేశారు. ఈ సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లు పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. Also read : Rajasekhar, Jeevitha: రాజశేఖర్, జీవిత, ఇద్దరు కూతుళ్లకు కరోనా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe