Pawan Kalyan Watch Price పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలో త్రివిక్రమ్ ఓ డైలాగ్ రాశాడు. సమంతతో ఆ డైలాగ్ చెప్పిస్తాడు. ఆయన వాచ్ అమ్మితే మీ లైఫ్ సెట్ అయిపోద్ది అంటూ ఓ డైలాగ్‌ను పెట్టాడు. అయితే అది కేవలం సినిమా కోసమే రాసినట్టుగా అనిపించదు. రియల్ లైఫ్‌లోనూ పవన్ కళ్యాణ్ లగ్జరీ లైఫ్‌ను చూసి రాసినట్టుగా అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ వాచ్ ధర ఎంతో తెలిస్తే ఇప్పుడు షాక్ అవుతారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా పవన్ కళ్యాణ్‌ ఇప్పుడు వినోదయ సిత్తం రీమేక్‌తో బిజీగా ఉన్నాడు. సముద్రఖని దర్శకత్వంలో రాబోతోన్న ఈ మూవీలో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు. గత వారమే ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభమైంది. అయితే ఈ మూవీ కోసం పవన్ కళ్యాణ్‌ తీసుకుంటోన్న రెమ్యూనరేషన్ గురించి ఎంతగా హాట్ టాపిక్ జరిగిందో అందరికీ తెలిసిందే. రోజుకు రెండున్నర కోట్లు అని, మూడు కోట్లు అని, నాలుగు కోట్లు తీసుకుంటున్నాడనే టాక్ వచ్చింది.


ఇక తాజాగా పవన్ కళ్యాణ్‌ ధరించిన గడియారం ధర మీద చర్చలు నడుస్తున్నాయి. సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమా టీజర్ రేపు రాబోతోండగా.. నేడే పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేకంగా చూపించారు. దీని కోసం వినోదయ సిత్తం సెట్‌లోకి విరూపాక్ష టీం వచ్చింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ ఫోటోలు బయటకు వచ్చింది.


ఈ ఫోటోల్లో పవన్ కళ్యాణ్‌ ధరించిన వాచ్ మీద అందరి దృష్టి పడింది. ఇప్పుడు ఈ గడియారం ధర మీద చర్చలు జరుగుతున్నాయి. ఈ వాచ్ ధర దాదాపు ఆరు లక్షలకు దగ్గర్లో ఉంటుందని తెలుస్తోంది. IWC పైలట్స్ టాప్ గన్ 41 ఎంఎం మెన్స్ వాచ్ అని తెలుస్తోంది. దాని ధర ఇండియాలో 5.87లక్షల వరకు ఉంటుందని సమాచారం. మొత్తానికి పవన్ కళ్యాణ్‌ ధరించే షూలు, గడియారాలు, షర్ట్‌ల గురించి  ఎప్పుడూ చర్చలు నడుస్తూనే ఉంటాయి.


పవన్ కళ్యాణ్‌ ప్రస్తుతం హరి హర వీరమల్లు సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. కానీ మధ్యలో వినోదయ సిత్తం అనే రీమేక్‌ను సెట్ చేశాడు త్రివిక్రమ్. ఇక సుజిత్ సినిమా కూడా లైన్‌లోకి వచ్చింది. కానీ హరీష్‌ శంకర్ సినిమా సంగతిని మాత్రం పవన్ కళ్యాణ్‌ తేల్చడం లేదు. ఇవన్నీ ఎప్పుడు పూర్తవుతాయనే విషయంలో క్లారిటీ మాత్రం లేదు.


Also Read:  Anupama Parameswaran Saree pics : కొప్పున పూలెట్టుకొని.. అందమంటే అనుపమదేనా?.. చీరకట్టుకే కళ వచ్చిందా?


Also Read: Amala Akkineni : కుక్కల మీద అలాంటి కామెంట్లు చేసిందా?.. అమల నిజంగానే అలా అనేసిందా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook