Vakeel Saab Movie Review, Highlights and Rating in Telugu: వకీల్ సాబ్ మూవీ రివ్యూ, రేటింగ్, ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్, హైలైట్స్
Vakeel Saab Movie Review, Highlights and Rating in Telugu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ( Pawan Kalyan) నుండి సినిమా వచ్చి మూడున్నరేళ్ళవుతోంది. పాలిటిక్స్‌లో బిజీ అయిన పవన్ కల్యాణ్ మధ్యలో చిన్న గ్యాప్ తీసుకుని మళ్లీ వరుసగా ఒకేసారి నాలుగు చిత్రాలకు సైన్ చేశారు. అలా ముందుగా ఆడియెన్స్ ముందుకు వస్తున్న సినిమా వకీల్ సాబ్ మూవీ. పవన్ కళ్యాణ్ అభిమానుల (Pawan Kalyan`s fans) కోసం కథలో చేర్చిన కమర్షియల్ ఎలిమెంట్స్ సినిమాకు హైలైట్‌గా (Vakeel Saab highlights) నిలిచాయి.
నటీనటులు : పవన్ కళ్యాణ్, శృతిహాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల, ప్రకాష్ రాజ్, సుబ్బరాజు తదితరులు
కెమెరామెన్ : పి.ఎస్.వినోద్
సంగీతం : థమన్
సమర్పణ : బోణీ కపూర్
నిర్మాతలు : దిల్ రాజు, శిరీష్
రచన- దర్శకత్వం : శ్రీరామ్ వేణు
నిడివి : 155 నిమిషాలు
సెన్సార్ : U/A
విడుదల తేది : 9 ఏప్రిల్ 2021
Vakeel Saab movie review, highlights and rating in Telugu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ( Pawan Kalyan) నుండి సినిమా వచ్చి మూడున్నరేళ్ళవుతోంది. పాలిటిక్స్‌లో బిజీ అయిన పవన్ కల్యాణ్ మధ్యలో చిన్న గ్యాప్ తీసుకుని మళ్లీ వరుసగా ఒకేసారి నాలుగు చిత్రాలకు సైన్ చేశారు. అలా ముందుగా ఆడియెన్స్ ముందుకు వస్తున్న సినిమా వకీల్ సాబ్ మూవీ. బాలీవుడ్‌లో విమర్శకుల ప్రశంసలు అందుకున్న పింక్ మూవీకి తెలుగు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఈరోజే థియేటర్స్‌లో అడుగుపెట్టింది. మరి ఈ కమ్ బ్యాక్ ఫిలింతో పవన్ కళ్యాణ్ ప్రేక్షకులను పూర్తి స్థాయిలో ఆకట్టుకున్నాడా ? సినిమా ఒరిజినల్ సినిమాను మించి మెస్మరైజ్ చేసిందా లేదా అనే వివరాలు ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
హైదరాబాద్‌లో ఓ కాలనీలో ఉంటూ వర్క్ చేసుకునే పల్లవి (Nivetha Thomas), జరీనా (Anjali), దివ్య (Ananya Nagalla) అనుకోకుండా ఓ రాత్రి ముగ్గురు అబ్బాయిలతో రిసార్ట్స్‌లో స్టే చేయాల్సి వస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో స్నేహితుడి వల్ల రిసార్ట్‌కి చేరుకున్న పల్లవిని ఇబ్బంది పెడుతూ హత్యాచారం చేసేందుకు ప్రయత్నిస్తాడు మంత్రి కొడుకు వంశీ (వంశీ కృష్ణ). దాంతో అతని నుండి తప్పించుకునే క్రమంలో వంశీ ముఖంపై దాడి చేస్తుంది పల్లవి.
పల్లవి చేసిన దాడిలో గాయపడిన వంశీ.. తన తండ్రి సపోర్ట్‌తో స్నేహితులతో కలిసి పల్లవి మీద రివేంజ్ తీర్చికునేందుకు ప్లాన్ చేస్తాడు. ఈ క్రమంలో పల్లవి తనను గాయపరిచినట్టుగా ఆమెపై కేసు పెట్టి జైలుకి పంపిస్తాడు. స్నేహితురాలు పల్లవిని జైలు నుండి బయటికి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్న జరీనా , దివ్యలకు ఆ కాలనీలో ఉండే సస్పెండ్ లాయర్‌గా ఉన్న సత్య దేవ్ (పవన్ కళ్యాణ్) తమ సమస్యకి పరిష్కారం చూపే వ్యక్తిగా కనిపిస్తాడు. జనం కోసమే నల్ల కోర్టు ధరించి వకీల్ సాబ్‌గా మారిన సత్యదేవ్ ఫైనల్‌గా పల్లవి కేసు టేకప్ చేసి తన వాదనలతో చివరికి పల్లవి, జారీనా, దివ్యలకు ఎలా న్యాయం చేసాడనేదే మిగతా కథ.
Also read : Vakeel Saab Movie: వకీల్ సాబ్ మూవీ షో మధ్యలో ఆపేశారని, థియేటర్‌లో ప్రేక్షకులు విధ్వంసం Video Viral
నటీనటుల పనితీరు :
మహిళలకు అండగా నిలిచి న్యాయం వైపు పోరాడే వకీల్ సాబ్ పాత్రలో పవన్ కళ్యాణ్ మెప్పించాడు. పవన్ కెరీర్ బెస్ట్ క్యారెక్టర్స్‌లో ఇది కూడా ఒకటని చెప్పుకునేలా ఉంటుంది. ముఖ్యంగా కోర్టు రూమ్ సన్నివేశాల్లో పవన్ నటన అభిమానులతో పాటు అందరినీ అలరిస్తుంది. అలాగే యాక్షన్ ఎపిసోడ్స్‌లో పవన్ పవర్ కనిపించింది. పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో అభిమానులతో విజిల్స్ వేయించాడు. ఓవరాల్‌గా పాత్రలో ఒదిగిపోయి క్యారెక్టర్‌కి బెస్ట్ ఇచ్చాడు పవన్. శృతి హాసన్ (Shruti Haasan) క్యారెక్టర్ ఫ్లాష్‌బ్యాక్‌కే పరిమితమైనప్పటికీ ఉన్నంతలో తన పాత్రకు న్యాయం చేసింది.
కథలో కీలకమైన పాత్రలు దొరకడంతో నివేదా థామస్, అంజలి, అనన్య తమ నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా కోర్ట్ సన్నివేశాల్లో నివేదా థామస్, అంజలి మంచి నటన కనబరిచి ఆ సన్నివేశాలకు బలం చేకూర్చారు. నందాజీ పాత్రకి ప్రకాష్ రాజ్ పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. నెగిటివ్ రోల్స్‌తో ముఖేష్ ఋషి, వంశీ కృష్ణ మెప్పించారు. శరత్ బాబు అతిథి పాత్రలో మెరిశాడు. జడ్జి పాత్రలో కనిపించిన నటుడు ఆ రోల్‌కి సరిగ్గా కుదిరాడు. శుభలేఖ సుధాకర్, షయాజీ షిండే, నాగినీడు, నాగ మహేష్, శ్రీకాంత్ అయ్యంగార్, అనిష్ కురువిల్లా, కేదార్ శంకర్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక వర్గం పనితీరు :
రిలీజ్‌కి ముందే తన పాటలతో సినిమాకు హైప్ తీసుకొచ్చిన థమన్ అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించి సినిమాకు మెయిన్ పిల్లర్‌గా నిలిచాడు. థమన్ అందించిన నాలుగు పాటలు విజువల్‌గా కూడా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా “మగువా మగువా” సాంగ్ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ‘కదులు కదులు’ , ‘సత్య మేవ జయతే’ (Gundetho Spandistadu song) పాటలు మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. పి.ఎస్.వినోద్ కెమెరా వర్క్ సినిమాకు మరో ప్లస్ పాయింట్. విజువల్స్ బాగా ఎట్రాక్ట్ చేశాయి. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాగుంది. సినిమాను పర్ఫెక్ట్ మీటర్‌లో కట్ చేశాడు.
Also read : Producer Dil Raju: వకీల్ సాబ్ బెనిఫిట్ షోలో ప్రొడ్యూసర్ దిల్ రాజు రచ్చరచ్చ, ఫొటోలు తీసిన భార్య
రవివర్మ మాస్టర్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ అభిమానులను బాగా అలరించాయి. తిరు అందించిన కొన్ని డైలాగ్స్ సన్నివేశాలకు మరింత బలం చేకూర్చాయి. రాజీవన్ ప్రొడక్షన్ డిజైనింగ్ బాగుంది. శ్రీరామ్ వేణు దర్శకుడిగా ఈ రీమేక్‌ని బాగా హ్యాండిల్ చేశాడు. ముఖ్యంగా తను చేసిన మార్పులు క్లిక్ అయ్యాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ ప్రొడక్షన్ వాల్యూస్ కథకు తగ్గట్టుగా ఉన్నాయి.
కొన్ని కథలు ఎన్ని భాషలో తీసినా మళ్ళీ ప్రేక్షకులు చూసేలా ఉంటాయి. అలాంటి కథలతో ఎన్ని సినిమాలు వచ్చినా ఈజీగా పాస్ అవుతుంటాయి. అలాంటి బలమైన కథే ఇది. ముగ్గురు మహిళలకు అండగా నిలబడి వారికి న్యాయం జరిగేలా పనిచేసే లాయర్ కథతో హిందీలో ‘పింక్’ అని తీసినా తమిళ్‌లో ‘నెర్కొండ పావై’ వచ్చినా సూపర్ హిట్స్ సాధించాయి. అందుకే ఈ కథను మన తెలుగు ప్రేక్షకులకు కూడా చూపించాలనుకున్నాడు నిర్మాత దిల్ రాజు. ఇలాంటి బలమైన కథను అంతే బలమైన హీరో చెప్తే రీచ్ ఎక్కవగా ఉంటుందని భావించి పవన్‌కి వినిపించి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడు. అక్కడే ఈ సినిమా సగం విజయం సాధించింది. నిజంగా ఈ కథకి పవన్ పూర్తి న్యాయం చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇది పవన్‌కి మంచి కమ్ బ్యాక్ ఫిలిం అని చెప్పొచ్చు.
ఇక కేవలం రెండు సినిమాల అనుభవం మాత్రమే ఉన్న శ్రీ రామ్ వేణు ఈ రీమేక్ సినిమాను బాగా డీల్ చేశాడు. హిందీ , తమిళ్‌లో లేని కమర్షియల్ ఎలిమెంట్స్ చేర్చి సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళాడు. ముఖ్యంగా కథ ఎక్కడా డిస్టర్బ్ అవ్వకుండా కొన్ని మార్పులతో తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటుంది. “మగువా మగువా” సాంగ్‌తో లీడ్ తీసుకొని సినిమా స్టార్ట్ చేసిన దర్శకుడు శ్రీరామ్ వేణు పదిహేను నిమిషాల పాటు కథ కోసం టైం తీసుకున్నాడు. సినిమా మొదలైన పదిహేను నిమిషాల తర్వాత పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ (Pawan Kalyan's entry scene from Vakeel Saab) ఉంటుంది. ఆ ఎంట్రీ సీన్ అభిమానులకి విపరీతంగా నచ్చేలా తెరకెక్కించాడు దర్శకుడు. ఇక మొదటి భాగంలో ఒక వైపు కథను చెప్తూనే మరోవైపు పవన్‌కి సెపరేట్ ఫ్లాష్‌బ్యాక్ క్రియేట్ చేసి రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ సినిమాను ముందుకు నడిపించాడు దర్శకుడు. అయితే శ్రీ రామ్ వేణు రాసుకున్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో కొన్ని సన్నివేశాలు అలరించగా మరికొన్ని ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్‌లో హీరో -హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ అంత ఎఫెక్టివ్‌గా అనిపించలేదు. అది మినహాయిస్తే ఫస్ట్ హాఫ్‌లో పెద్దగా మైనస్‌లు అనిపించవు.
Also read : Vakeel Saab Songs: ఒక్క క్లిక్‌తో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సాంగ్స్ జూక్ బాక్స్
ఇంటర్వెల్ బ్యాంగ్ దానికి ముందు వచ్చే పార్క్‌లో ఫైట్ ఫస్ట్ హాఫ్‌లో మేజర్ హైలైట్‌గా (Major highlights of Vakeel Saab) నిలిచాయి. ఇక రెండో భాగంలో కోర్ట్ రూమ్ సన్నివేశాలతో సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళాడు శ్రీరామ్ వేణు. ముఖ్యంగా సెకండాఫ్‌లో పవన్ కళ్యాణ్ - ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే కోర్టు వాదనల సన్నివేశాలు, పవన్ చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్స్ ప్రేక్షకుడు పెట్టిన టికెట్టుకి సంతృప్తి కలిగిస్తాయి. అలాగే పవన్ సినిమాకి మొదటిసారి మ్యూజిక్ కంపోజ్ చేసిన థమన్.. ది బెస్ట్ ఇచ్చాడు. కొన్ని సన్నివేశాలతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్‌కి కూడా థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ( Vakeel Saab BG) మంచి ఇంపాక్ట్ తీసుకొచ్చింది. ముఖ్యంగా మెట్రో ట్రైన్ ఫైట్ తర్వాత పవన్ స్టేషన్‌లో నడుస్తూ వచ్చే షాట్‌కి థమన్ ఇచ్చిన స్కోర్ రోమాలు నిక్కపోడిచేలా చేస్తుంది.
రిలీజ్‌కి ముందే దర్శకుడు శ్రీరామ్ వేణు (Director Sriram Venu) చెప్పినట్టు కథలో పవన్ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుండి ప్రతీ పదినిమిషాలకు ఓ హై ఎలిమెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా సినిమా మీటర్ పెంచేలా నాలుగు అదిరిపోయే ఫైట్స్ పెట్టి మాస్ ఆడియన్స్‌కి ఫుల్‌మీల్స్ పెట్టారు. పార్క్ ఫైట్, బాత్రూమ్ ఫైట్‌తో పాటు మెట్రో ట్రైన్‌లో వచ్చే ఫైట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. అలాగే రెండో భాగంలో పవన్ చెప్పే పవర్‌ఫుల్ డైలాగులు సన్నివేశాలకు మరింత బలం చేకూర్చి ప్రేక్షకులతో క్లాప్స్ కొట్టిస్తాయి. నిజానికి ఈ రీమేక్ సినిమాను డీల్ చేయడం కష్టం. అందులోనూ పవన్ లాంటి స్టార్ హీరోని పెట్టి అతని ఇమేజ్‌కి తగ్గట్టుగా మార్పులు చేసి సినిమా తీయడం కత్తి మీద సాము లాంటి పని. దాన్ని పర్ఫెక్ట్‌గా డీల్ చేసి దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు శ్రీరామ్ వేణు.
Also read : Vakeel Saab benefit shows: వకీల్ సాబ్ బెనిఫిట్ షోలకు పర్మిషన్ వచ్చిందా ?
పవన్ కళ్యాణ్ అభిమానుల (Pawan Kalyan's fans) కోసం కథలో చేర్చిన కమర్షియల్ ఎలిమెంట్స్ సినిమాకు హైలైట్‌గా (Vakeel Saab highlights) నిలిచాయి. ముఖ్యంగా మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్‌ని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో సరిగ్గా అలాగే చూపించాడు. ఓవరాల్‌గా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కమ్ బ్యాక్ ఫిలిం నుండి ఆశించే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ రీమేక్‌ని తెరకెక్కించిన దర్శకుడు ఆడియన్స్‌కి ఓ డీసెంట్ సినిమా అందించాడు. ఫైనల్‌గా కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కిన ‘వకీల్ సాబ్’ (Vakeel Saab movie) అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా కచ్చితంగా ఆకట్టుకుంటుంది.
ప్లస్ పాయింట్స్
పవన్ కళ్యాణ్
థమన్ మ్యూజిక్
ఫైట్స్
డైలాగ్స్
కోర్ట్ రూమ్ సన్నివేశాలు
మైనస్ పాయింట్స్:
ఫ్లాష్ బ్యాక్
లవ్ ట్రాక్
రొటీన్ అనిపించే సన్నివేశాలు
బాటమ్ లైన్ – పైసా వసూల్ సాబ్
రేటింగ్ : 3.25/5
జీ సినిమాలు సౌజన్యంతో...
Also read : Sulthan movie review: సుల్తాన్ మూవీ రివ్యూ, రేటింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook