Vakeel Saab Producer Dil Raju : టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అసెంబ్లీ ఎన్నికల కారణంగా కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ల తరువాత ఫ్యాన్స్‌కు అందిస్తున్న మూవీ కావడంతో తెలుగు రాష్ట్రాల్లో వకీల్ సాబ్ మేనియా కనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ సైతం అభిమానులుగా మారిపోయి పవన్ మూవీ చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వకీల్ సాబ్ నిర్మాత దిల్ రాజు అయితే ఏకంగా పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా మారిపోయాడు. నేటి ఉదయం శివపార్వతి థియేటర్‌లో వకీల్ సాబ్ మూవీ బెనిఫిట్ షో ప్రదర్శించగా.. తన సతీమణితో కలిసి పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీని దిల్ రాజు వీక్షించారు. గతంలో ఎన్నడూలేనట్లుగా థియేటర్లో దిల్ రాజు సందడి చేశాడు. పేపర్లు చింపివేసి గాల్లోకి విసురుతూ థిటయేర్లో ఓ మామూలు అభిమానిగా హల్ చల్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన వకీల్ సాబ్(Vakeel Saab) హిందీలో వచ్చిన పింక్ సినిమా తెలుగు రీమేక్‌గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


Also Read: Vakeel Saab Songs: ఒక్క క్లిక్‌తో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సాంగ్స్ జూక్ బాక్స్



ఫ్యాన్ బాయ్‌గా మారిన దిల్ రాజు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నిర్మాత అయి ఉండి దిల్ రాజు పవన్ కళ్యాణ్ డైహార్డ్ ఫ్యాన్‌గా థియేటర్లో సందడి చేస్తున్న ఫొటోలు, వీడియోలు ట్రెండింగ్ అవుతున్నాయి. దిల్ రాజుకు కుర్రతనం ఇంకా పోలేదంటూ హుషారుగా ట్వీట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సైతం వీటిని ఎంజాయ్ చేస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీకపూర్ సమర్పణలో టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించాడు. గబ్బర్ సింగ్ తరువాత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సరసన శ్రుతిహాసన్ మరోసారి నటించింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook