Pawan Kalyan’s Vakeel Saab to Vijay’s Master South Movies ruled Twitter trends in 2021 : సోషల్ మీడియాలో ఒకప్పడు బాలీవుడ్‌కు ఫుల్ క్రేజ్‌ ఉండేది.. కానీ ఇప్పుడు సౌత్ ఇండియా ఇండస్ట్రీ క్రేజ్ పెరిగిపోయింది. సోషల్ మీడియాలో సౌత్ మూవీలు ట్రెండ్‌లో నిలుస్తున్నాయి. టాలీవుడ్, (Tollywood) కోలీవుడ్ మూవీల గురించే ఇప్పుడు సోషల్ మీడియాలో (Social media) ఎక్కువగా డిస్కషన్ నడుస్తోంది. ట్విట్టర్‌ తాజాగా‌.. 2021 మోస్ట్ ట్వీటెడ్ మూవీస్ (2021 Most Tweeted Movies) లిస్ట్‌ను రిలీజ్ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ లిస్ట్‌లో టాప్ 5 మూవీలున్నాయి. అవన్నీ కూడా సౌత్ మూవీలే కావడం విశేషం. కోలీవుడ్, (Kollywood) టాలీవుడ్‌ సినిమాలకు ఈ లిస్ట్‌లో స్థానం దక్కింది. అందులో టాలీవుడ్‌ నుంచి వకీల్‌సాబ్ (Vakeel Saab) మూవీ ఉంది. 



 


విజయ్, (Vijay) అజిత్ (Ajith) మూవీలు మొదటి రెండు స్థానాలను దక్కించుకున్నాయి. పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ ఐదో స్థానంలో నిలిచింది. అయితే టాలీవుడ్ నుంచి 2021 మోస్ట్ మోస్ట్ ట్వీటెడ్ మూవీస్ లిస్ట్‌లో (2021 Most Tweeted Movies) ఒక్క వకీల్‌సాబ్‌కు మాత్రమే స్థానం దక్కింది. మిగతా నాలుగు స్థానాలను కోలీవుడ్ మూవీలే దక్కించుకున్నాయి. ఇందులో విజయ్ సినిమాలే రెండు ఉన్నాయి. 



ఇక 2021లో భారతదేశంలో ఎక్కువగా ట్వీటెడ్ అయిన మూవీలో విజయ్ మాస్టర్ (Master) సినిమా ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. సెకెండ్‌ ప్లేస్‌లో అజిత్ వాలిమై మూవీ ఉంది. ఈ మూవీ ఇంకా విడుదల కాలేదు కానీ.. సినిమాకు సంబంధించి ప్రోమో, మేకింగ్ వీడియోలపై డిస్కషన్స్ పెద్ద ఎత్తున సాగడంతో ఇది లిస్ట్ లో చేరిపోయింది. 


Also Read : Pushpa Pre Release Event: ‘పుష్ప’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు రంగం సిద్ధం.. వేడుక ఎప్పుడంటే?


ఇక విజయ్ మరో మూవీ బీస్ట్ కూడా షూటింగ్‌ దశలోనే ఉన్నా ఈ మూవీ మూడో స్థానాన్ని ఆక్రమించింది. ఇటీవల రిలీజైన సూర్య జై భీమ్ మూవీ నాలుగో స్థానంలో నిలిచింది. ఇక చివరి స్థానంలో అంటే ఐదో స్థానంలో మన తెలుగు మూవీ వకీల్‌సాబ్ (Vakeel Saab) నిలిచింది. వకీల్‌సాబ్ మూవీపై ఎక్కువగా ట్వీట్స్ పోస్ట్ అయ్యాయి. మొత్తానికి 2021లో ట్విట్టర్‌‌ను సౌత్ సినీ ఇండస్ట్రీ దున్నిపాడేసింది. 



Also Read : RRR Trailer: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ బాగోలేదంట.. ట్విటర్‌లో దారుణంగా కామెంట్స్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook