Pushpa Pre Release Event: ‘పుష్ప’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు రంగం సిద్ధం.. వేడుక ఎప్పుడంటే?

Pushpa Pre Release Event: ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్​, దర్శకుడు సుకుమార్​ కాంబినేషన్​లో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్​ చిత్రం 'పుష్ప' (Pushpa Movie Updates). ఈ సినిమాలోని తొలి భాగం డిసెంబరు 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్​లో జోరు పెంచిన చిత్రబృందం.. చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను డిసెంబరు 12న హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 9, 2021, 06:22 PM IST
    • పుష్ప సినిమా నుంచి క్రేజీ అప్డేట్ ప్రకటించిన మేకర్స్
    • డిసెంబరు 12న ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహణ
    • హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ వేదికగా ఈవెంట్
Pushpa Pre Release Event: ‘పుష్ప’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు రంగం సిద్ధం.. వేడుక ఎప్పుడంటే?

Pushpa Pre Release Event: ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్​, దర్శకుడు సుకుమార్​ కాంబినేషన్​లో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్​ చిత్రం 'పుష్ప' (Pushpa Movie Updates). ఇప్పటి వరకు వీరిద్దరి కాంబోలో విడుదలైన సినిమాలు సూపర్​ హిట్లుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో వీరి మూడో చిత్రం 'పుష్ప'పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఈ సినిమాలో అల్లు అర్జున్ (Allu Arjun News) లారీ డ్రైవర్ పుష్ప రాజ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను రెండు పార్ట్స్​గా తెరకెక్కిస్తుండగా.. మొదటి భాగమైన 'పుష్ప ది రైజ్​'ను డిసెంబరు 17న థియేటర్లలో విడుదల (Pushpa Movie Release Date) చేయనుంది చిత్రబృందం. రిలీజ్​ డేట్​ దగ్గరు పడనుండడం వల్ల సినిమా ప్రమోషన్స్​లో జోరు చూపిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను డిసెంబరు 12న నిర్వహించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఈ వేడుకను నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఈ ఈవెంట్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఛీఫ్ గెస్ట్ గా రానున్నారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై చిత్రబృందం క్లారిటీ ఇవ్వలేదు.

పాన్​ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు, హిందీ. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో డిసెంబర్ 17న  ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ (Mytri Movie Makers Banner) పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరనస రష్మిక మందన (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫహాద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. వీళ్లే కాకుండా యాంకర్ అనసూయ (Anchor Anasuya), సునీల్ తదితరలు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.  

Also Read: RRR Trailer Review: RRR ట్రైలర్ లో ఇది గమనించారా..? రామ్ Vs భీమ్ ఫైట్ సీక్వెన్స్

Also Read: RRR Trailer Response: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ కు సెలెబ్రిటీలు ఫిదా.. RRR Teamపై ప్రశంసలు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News