Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై పగబట్టిన హీరోయిన్.. మరో బాంబు పేల్చిన పూనమ్ కౌర్
Poonam Kaur Sensational Allegations On Trivikram Srinivas And Pawan Kalyan: మరో వివాదం తెలుగు సినీ పరిశ్రమలో రాజుకుంది. మరోసారి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై సినీ నటి పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు చేయగా.. ఈ సారి మూవీ ఆర్టిస్ట్స్ సంఘాన్ని వివాదంలోకి లాగడం కలకలం రేపింది.
Poonam Kaur Allegations: తెలుగు సినీ పరిశ్రమలో మరో వివాదం రాజుకుంది. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై పగబట్టినట్టు హీరోయిన్ పూనమ్ కౌర్ ఉన్నారు. గతంలో తాను చేసిన ఫిర్యాదును మూవీ ఆర్టిస్ట్స్ సంఘం పట్టించుకోలేదని ఆరోపించారు. మా సంఘంపై ఈ సందర్భంగా సంచలన ఆరోపణలు చేసింది. తాను త్రివిక్రమ్‌పై చేసిన ఫిర్యాదుపై ఎలాంటి స్పందన లేదని మండిపడింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తన జీవితాన్ని నాశనం చేశాడని సంచలన ఆరోపణలు చేసింది.
Also Read: Allu Arjun Bail: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు భారీ ఊరట.. రెగ్యులర్ బెయిల్ మంజూరు
కొన్నాళ్ల నుంచి హీరోయిన్ పూనమ్ కౌర్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై బాహాటంగా సంచలన ఆరోపణలు చేస్తోంది. గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన ఆమె తాజాగా అదే విషయాన్ని 'ఎక్స్' వేదికగా ప్రస్తావించింది. ఈసారి త్రివిక్రమ్ వ్యవహారంలో మా అసోసియేషన్‌పై కూడా ఆరోపణలు చేసింది. 'త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై గతంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేశా. అయితే ఆయన వెనుక ఉన్న పెద్ద మనుషుల కారణంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ నా ఆరోగ్యం.. ఆనందాన్ని ప్రభావితం చేసి నా జీవితాన్ని నాశనం చేశాడు' అని మరోసారి త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ ఆరోపించింది.
Also Read: Game Changer Trailer: 'గేమ్‌ఛేంజర్'లో రామ్ చరణ్ అన్నదమ్ముళ్లా.. తండ్రీకొడుకులా?
పూనమ్ కౌర్ చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలోనే కాక రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. ఆమె డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి చేశారని స్పష్టంగా తెలుస్తోంది. పరిశ్రమలో త్రివిక్రమ్.. పవన్ కల్యాణ్ మంచి స్నేహితులు. పవన్ కల్యాణ్ ద్వారా త్రివిక్రమ్ శ్రీనివాస్ వలన ఆమె మోసానికి గురయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తరుచూ పవన్, తివిక్రమ్‌ను ప్రధానంగా చేసుకుని తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేస్తోంది. తాజాగా చేసిన ఆరోపణలు ఆ కోవలోనివే.
ఫిర్యాదు చేయలేదు: మా సంఘం
పూనమ్ కౌర్ చేసిన ఆరోపణలు సంచలనం రేపడంతో సినీ పరిశ్రమలో కలకలం సృష్టించింది. ఈ ఆరోపణలపై వెంటనే మా సంఘం స్పందించింది. పూనమ్ కౌర్ ట్వీట్‌పై మా కోశాధికారి శివబాలాజీ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. 'పూనమ్ కౌర్ నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు రాతపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు రాలేదు. మా టర్మ్ కంటే ముందు కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా రికార్డులలో లేదు. పూనమ్ కౌర్ ట్విటర్‌లో పెట్టడం వల్ల ఉపయోగం లేదు. మా అసోసియేషన్‌ను కానీ.. న్యాయ వ్యవస్థను కానీ ఆశ్రయిస్తేనే న్యాయం జరుగుతుంది' అని శివబాలాజీ పేర్కొన్నాడు.
మా సంస్థ స్పందనతో పూనమ్ కౌర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఫిర్యాదు రాలేదని చెప్పడంతో త్వరలోనే పూనమ్ స్వయంగా.. లేదా లిఖితపూర్వకంగా మా సంఘానికి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.