Pawan Kalyan: ప్రస్తుతం టాలీవుడ్‌లో జానీ మాస్టర్ ఎపిసోడ్ సంచలనం రేపుతోంది. పవన్ కళ్యాణ్ టార్గెట్‌గా ఎపిసోడ్ సాగుతోందనే చర్చ జరుగుతోంది. లైంగిక వేధింపుల ఘటనలో జానీ మాస్టర్‌ చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. జానీ మాస్టర్ వ్యవహారం రేపిన సెగ జనసేనకు తాకడంతో పవన్ కల్యాణ్‌ అలర్ట్ అయ్యారు. దాంతో జానీ మాస్టర్‌ను జనసేన నుంచి పవన్ దూరం పెట్టడమే కాదు. అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసారు.  జానీ మాస్టర్‌ తీరుపై ఫిలిం ఛాంబర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అంతేకాదు సినీ ఇండస్ట్రీలో లైంగిలక వేధింపులకు గురైన వారు తమకు ఫిర్యాదు చేయవచ్చని పేర్కొంది. అంతేకాదు లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొత్తంగా జానీ మాస్టర్ తనపై ఎన్నో ఏళ్లుగా అత్యాచారం చేసినా.. ఇపుడు సదరు లేడీ కొరియోగ్రాఫర్ ఎందుకు కిమ్మనలేదు. ఇపుడే ఫిర్యాదు చేయడానికి గల కారణాలేంటి.. ? ఎవరైనా ఆమెపై ఒత్తిడి తెచ్చారా...అనే విషయాలు కూడా హాట్ టాపిక్ గా మారాయి. మొత్తంగా జానీ మాస్టర్ వ్యవహారంతో లైంగిక వేధింపుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. లైంగిక వేధింపులనేవి ఇపుడు మలయాళ సినీ ఇండస్ట్రీని కూడా ఓ కుదుపు కుదుపుతోంది. మొత్తంగా ఇందుగలడు అందులేడనే సందేహం వలదన్నట్టు అన్ని ఇండస్ట్రీల్లో ఈ లైంగిక వేధింపులు ఉన్నాయనేది జాతీయ క్రైమ్ బ్యూరో చెబుతుంది. గ్లామర్ ఇండస్ట్రీ కాబట్టి సినీ ఇండస్ట్రీలో చీమ చిటుక్కుమన్న అందరు దృష్టి దానిపై ఉంటుంది.
 

 ఒక వైపు ఈ ఎపిసోడ్.. రసకందాయంలో ఉండగానే పాత ఫిర్యాదుతో త్రివిక్రమ్‌ ను పూనమ్‌ కౌర్ టార్గెట్ చేయడం రాజకీయ వర్గాల్లో కాక  రేపుతోంది. ఒక రకంగా త్రివిక్రమ్ పేరుతో ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ను పూనమ్ కౌర్ టార్గెట్ చేసిందనే కామెంట్స్ కూడా వినబడుతున్నాయి. ఈమె వెనక వైసీపీ నేతలు ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. నిజంగానే పూనమ్ కౌర్.. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ లు వేధించారా.. ? ఒక వేళ వేధించి ఉంటే తప్పక శిక్ష అనుభవించాల్సిందే. అయితే.. ఈమెకు ఛాన్సులు ఇస్తానని చెప్పి తనకు ఏ విధంగా కూడా సినిమాల్లో ప్రమోట్ చేయలేదనేది పూనమ్ కౌర్ వర్గాలు చెబుతున్న మాట. సినీ ఇండస్ట్రీలో టాలెంట్ ఉంటేనే ఛాన్సులు వస్తాయి. అలాంటి ఇండస్ట్రీలో ఎవరిని ఎవరు ఒకటి రెండు సినిమాల వరకు ప్రమోట్ చేసినా.. టాలెంట్ ఉంటేనే లైమ్ లైట్ లోకి వస్తారు. ఆ తర్వాత సొంతంగానే ఎదగాలి. మరి పూనమ్ కౌర్ .. త్రివిక్రమ్ పై చేసిన ఈ కామెంట్స్  వ్యవహారం ఎంత వరకు వెళుతుందో చూడాలి.


ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..


ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.