Salaar Release Trailer: పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు సినిమాల్లో సలార్‌  ఒకటి. కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌.. పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ .. కాంబినేషన్‌లో వ‌స్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతుంది. ఇప్పటికే ట్రైలర్, ఫస్ట్ సింగిల్ తో ఈ సినిమా సూపర్ క్రేజ్ సంపాదించుకోగా, తాజాగా మూవీ టీమ్ మరో సాలిడ్ ట్రైలర్ ని రిలీజ్ చేసి ప్రభాస్ అభిమానులను మరింత ఖుషి చేసింది. ఈ ట్రైలర్ కోసం ప్రభాస్ అభిమానులు నిన్న రాత్రి నుంచి ఎదురు చూడగా.. ఎన్నో పోస్ట్ పోన్మెంట్స్ తర్వాత ఈరోజు మధ్యాహ్నం ఈ సినిమా మేకర్స్ ఈ ట్రైలర్ ని విడుదల చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఈ చిత్ర ట్రైలర్ విషయానికి వస్తే మొదటి ట్రైలర్ లాగానే రెండో ట్రైలర్ మొత్తం కూడా భారీ యాక్షన్ సన్నివేశాలతో నిండిపోయింది. తండ్రి కొడుకుకి సుల్తాన్ కథ చెప్పడంతో ప్రారంభమైన ఈ ట్రైలర్…సుల్తాన్ ఏ సమస్య వచ్చినా సైన్యంకి కాదు తన స్నేహితుడికి చెబుతారు అనే డైలాగ్ తో…. ప్రభాస్ ఆగమనాన్ని చూపించండి.. ఇక అక్కడ నుంచి ప్రశాంత్ నీల్ స్టైల్ లో.. విపరీతమైన గన్స్ వాడుక.. పొలిటికల్ గేమ్స్.. భారీ యాక్షన్ సీక్వెన్స్ తో ఈ ట్రైలర్ నిండిపోయింది.
చివరిగా ఈ కథ ప్రాణ స్నేహితులని ..భద్ర శత్రువులుగా మార్చడమే అంటూ.. మొదటి పార్ట్ వీరిద్దరూ శత్రువులుగా మారే దగ్గర ఆగుతుంది అన్నట్టుగా హింట్ ఇచ్చారు దర్శకుడు.



కాగా ఈ సినిమా నుంచి మొద‌ట విడుద‌ల చేసిన‌ ట్రైలర్‌కి ప్రశంసలతోపాటు విమర్శలు కూడా వచ్చిన విష‌యం తెలిసిందే. ఈ ట్రైలర్‌ని చూసిన కొంతమంది సినీ ప్రేక్షకులు అది మొత్తం ‘కేజీఎఫ్‌’ తరహాలోనే ఉందని, కథ కూడా దాదాపు అలాగే ఉందని, కామెంట్స్ పెడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో మూవీ నుంచి వచ్చిన సెకండ్ ట్రైల‌ర్‌ మాత్రం అందరిని మెప్పించేలానే ఉంది.


ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో పృథ్విరాజ్‍ సుకుమారన్, బాబీ సింహా, టిన్నూ ఆనంద్, ఈశ్వరి రావు, శ్రియా రెడ్డి, జగపతిబాబు, రామచంద్ర రాజు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో పోషించారు.  హొంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించిన ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతాన్ని సమకూర్చారు.


Also Read: Google Trend Video: వీడు మగాడ్రా బుజ్జి..ఏకంగా 16 అడుగుల కింగ్ కోబ్రాకు ముద్దు పెట్టాడు..మీరే చూడండి..


Also Read: Tamil Nadu Road Accident: తమిళనాడులో కారు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ అయ్యప్ప భక్తులు మృతి   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి