Radheshyam Teaser: ప్రభాస్ రాధేశ్యామ్ టీజర్ వచ్చేసింది
Radheshyam Teaser Introducing Prabhas as Vikramaditya : ప్రభాస్ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న రాధేశ్యామ్ టీజర్ ఎట్టకేలకు వచ్చేసింది. వింటేజ్ లవ్‌స్టోరీ మూవీగా తెరకెక్కిన రాధేశ్యామ్‌లో ప్రభాస్ లవర్‌బాయ్ పాత్రలో మెప్పించనున్నారు.
Prabhas Birthday Special Young Rebel Star Prabhas Radheshyam Teaser realese: యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు దీపావళి పండుగ ముందే వచ్చేసింది. ప్రభాస్ (Prabhas) హీరోగా తెరుకెక్కుతోన్న ‘రాధేశ్యామ్’ (Radheshyam) తనుంచి చాలా రోజులుగా ఎలాంటి అప్‌డేట్ లేదు. ప్రభాస్ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న రాధేశ్యామ్ టీజర్ (Radheshyam Teaser) ఎట్టకేలకు వచ్చేసింది. వింటేజ్ లవ్‌స్టోరీ (Love Story) మూవీగా తెరకెక్కిన రాధేశ్యామ్‌లో ప్రభాస్ లవర్‌బాయ్ పాత్రలో మెప్పించనున్నారు.
శనివారం ప్రభాస్ పుట్టినరోజు (Prabhas Birthday) సందర్భంగా రాధేశ్యామ్ టీజర్‌ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. సోషల్‌మీడియా వేదికగా మూవీ టీమ్ ఈ టీజర్‌ను ఫ్యాన్స్‌తో పంచుకుంది. లవర్‌బాయ్‌గా ప్రభాస్ లుక్, డైలాగ్‌లు, హావభావాలు అదిరిపోయాయి. ఇక జస్టిన్ ప్రభాకరణ్ (Justin Prabhakaran) అందించిన మ్యూజిక్ హైలెట్‌గా ఉంది.
Also Read : Happy Birthday Prabhas: అభిమానులకు డార్లింగ్- సినీ రంగంలో గ్లోబల్ స్టార్!
ఇందులో విక్రమాదిత్యగా (Vikramaditya) ప్రభాస్ లుక్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ప్రభాస్ ఇంగ్లీష్‌లో చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. నువ్వు ఎవరో నాకు తెలుసు... కానీ నీకు చెప్పను. నీ హృదయం ఎప్పుడు ముక్కలవుతుందో నాకు తెలుసు.. కానీ నీకు చెప్పను. నీ ఓటమి నాకు తెలుసు.. కానీ నీకు చెప్పను. నీ చావు నాకు తెలుసు.. కానీ నీకు చెప్పను. నాకు అన్నీ తెలుసు... కానీ నీకు చెప్పను. ఎందుకంటే, చెప్పినా మీ ఆలోచనలకు అందదు. నా పేరు విక్రమాదిత్య... నేను దేవుడిని కాదు. మీలో ఒక్కడిని కూడా కాదు’ అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. పూజా హేగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.
యువీ క్రియేషన్స్, (UV Creations) గోపికృష్ణ మూవీస్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి ప్రభాస్ (Prabhas) రాధేశ్యామ్ రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలిజ్ కానుంది.
Also Read : Ram Charan: 100 కోట్ల వాక్సినేషన్‌పై రామ్ చరణ్ ట్వీట్, కియారా అద్వానీతో షూటింగ్‌లో బిజీబిజీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook