Samantha Ruth Prabhu Birthday సమంత బర్త్ డే (ఏప్రిల్ 28) సందర్భంగా సోషల్ మీడియాలో ఆమె ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. అయితే ఏజెంట్, పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాల హడావిడి ముందు సమంత ఫ్యాన్స్ హంగామా కనిపించడం లేదు. ఇన్ స్టాగ్రాంలో అయితే సమంత ఫ్రెండ్స్ గ్యాంగ్‌ సందడి చేస్తున్నారు. సమంతకు స్పెషల్‌గా విషెస్‌లు చెబుతున్నారు. సమంత ఫ్రెండ్స్‌లో ఉండే నందినీ రెడ్డి, నీరజ కోన, డా మంజుల, ప్రీతమ్ వంటి వారు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సమంత ప్రీతమ్ రిలేషన్ మీద వచ్చినన్ని రూమర్లు ఇంకే సెలెబ్రిటీ మీద వచ్చి ఉండవు. సమంత తన స్టైలిష్ట్ ప్రీతమ్‌తో క్లోజ్‌గా ఉండటం, సోఫా మీద కూర్చోవడం, తన కాళ్లని ప్రీతమ్ ఒళ్లో పెట్టి రిలాక్స్ అవుతున్న ఫోటోలను షేర్ చేయడంతో రచ్చ రచ్చగా మారింది. సమంత మీద దారుణమైన ట్రోలింగ్ ఆ టైంలో జరిగింది. నాగార్జున కూడా ఫైర్ అయ్యాడని, అందుకే వెంటనే ఆ ఫోటోను డిలీట్ చేసిందని అంతా అనుకున్నారు.


[[{"fid":"270994","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


అలా సమంత ప్రీతమ్ మధ్య ఉండే రిలేషన్ మీద ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వస్తూనే ఉండేది. ఇక ప్రీతమ్ సైతం రకరకాల పోస్టులు వేస్తుండేవాడు. అవి సమంతను ఉద్దేశించి చేసినవేనా? అనేది మాత్రం స్పష్టత లేదు. ఇక సమంత విడాకుల సమయంలోనూ ప్రీతమ్ పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. ప్రీతమ్ వల్లే ఈ విడాకులు జరిగాయనే టాక్ వచ్చింది. దీంతో ప్రీతమ్ జాతీయ మీడియాతో మాట్లాడాడు. తాను సమంతను అక్కా అని పిలుస్తానని, ఆ విషయం చైతూకి కూడా తెలుసని, కానీ తమ మీద ఇలాంటి రూమర్లు వస్తున్నా కూడా చైతూ స్పందించకపోవడం బాధగా ఉందని ప్రీతమ్ చెప్పుకొచ్చాడు.


Also Read: Aham Brahmasmi : మౌనిక కోసం 'అహంబ్రహ్మాస్మి' వదిలేశా.. ఏడాదిన్నర చెన్నైలో.. మంచు మనోజ్ ఎమోషనల్


అయితే మధ్యలో ప్రీతమ్ కూడా సమంతకు దూరంగా ఉన్నట్టు కనిపించింది. ఇప్పుడు ఇలా సమంతకు స్పెషల్‌గా బర్త్ డే విషెస్ చెప్పాడు. సమంతలా ఇలా క్యాట్ వాక్ అయితే నేను చేయలేను అంటూ సమంత ఫన్నీ వీడియోను షేర్ చేశాడు. హ్యాపీ బర్త్ డే మై ఫేవరెట్ జీజీ అంటూ లవ్యూ చెప్పేశాడు. దానికి సమంత కూడా స్పందించింది. లవ్ సింబల్స్‌ను షేర్ చేసింది.


Also Read:  Sai Dharam Tej Accident : సాయి ధరమ్ తేజ్ అబద్దం చెప్పాడా?.. సాయం చేసిన వ్యక్తికి కష్టాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook