Puneeth Rajkumar's last rites: కన్నడ పవర్​స్టార్ పునీత్ రాజ్​కుమార్ హఠాన్మరణంతో.. సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. కన్నడతో పాటు ఇతర భాషా నటీనటులు పునీత్ మృతిపట్ల సంతాపం ప్రకటించారు. రాజకీయ, క్రిడా రంగాల ప్రముఖులు సైతం పునీత్ మృతిపట్ల సంతాపం తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పూనీత్ భౌతిక దేహానికి నేడు అత్యక్రియలు జరగనున్న నేపథ్యంలో.. చివరి చూపు కోసం ప్రముఖులు తరళి వస్తున్నారు. టాలీవుడ్​ నుంచి బాలకృష్ణ ఇప్పటికే బెంగళూరు బయల్దేరారు. చిరంజీవి, జూనియర్​ ఎన్టీఆర్​లు కూడా బెంగళూరు బెయల్దేరనున్నట్లు తెలుస్తోంది.


గుండెపోటుతో..


నిన్న ఉదయం వ్యాయామం చేస్తున్న సమయంలో పునీత్​కు గుండె పోటు రావడంతో.. ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు వ్యక్తిగత సిబ్బంది. వైద్యులు తీవ్రంగా శ్రమించినా పునీత్ ప్రాణాలు కాపాడలేకపోయారు. పునీత్ మృతి చెందారన్న వార్త విని అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. పునీత్ మరణంతో కర్ణాటకలో హైలర్ట్​ ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. సినిమా థియేటర్ల మూసివేయాలని ఆదేశించింది.


Also read: Puneeth Raj Kumar’s eyes: పునీత్ కుమార్ నేత్రదానం.. ఫోటోలు, వీడియోలు వైరల్


Also read: Puneeth Rajkumar Ashwini Revanth : పునీత్‌ రాజ్‌కుమార్, అశ్వినిల లవ్‌ స్టోరీ


కూతురు వచ్చాకే అత్యక్రియలు..


పునీత్ రాజ్​కుమార్ పార్ధివ దేహాన్ని బెంగళూరులోని కంఠీవ స్టేడియంలో అభిమానులు సందర్శనార్ధం ఉంచారు. అక్కడకు వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు తరలివస్తున్నారు.
పునీత్ తండ్రి, దిగ్గజ నటుడు రాజ్​కుమార్​ సమాధి దగ్గరే పునీత్ అత్యక్రియలు చేయనున్నారు. పునీత్ ఇద్దరు కూతళ్లలో ఒకరు అమెరికాలో ఉన్నారు. ఆమె వచ్చిన తర్వాతే అత్యక్రియలు నిర్వహించనున్నారు.


Also read: Manchu Lakshmi Tweet: పునీత్ రాజ్ కుమార్ మృతిపై మంచు లక్ష్మి ట్వీట్.. నెటిజన్ల ఆగ్రహం


Also read: Chiranjeevi Other Celebs Mourn: పునీత్‌ రాజ్‌కుమార్‌ మృతిపై చిరంజీవితో పాటు టాలీవుడ్ నటుల దిగ్భ్రాంతి


బాల నటుడిగా మెప్పించి.. స్టార్​ హీరోగా..


కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ మూడో కుమారుడు పునీత్‌ రాజ్‌కుమార్‌. బాలనటుడిగా వెండితెరకు పరిచయమైన పునీత్‌.. అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘బెట్టడా హువు’ చిత్రానికి గానూ ఉత్తమ బాలనటుడిగా అవార్డు సొంతం చేసుకున్నారు. హీరోగా ఇప్పటివరకూ ఆయన 32 చిత్రాల్లో నటించారు. ‘వసంత గీత’, ‘భాగ్యవంత’, ‘ఏడు నక్షత్రాలు’, ‘భక్త ప్రహ్లాద’, ‘యరివాను’ వంటి చిత్రాలు ఆయనకు హీరోగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇటీవల ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘యువరత్న’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా పునీత్‌ సుపరిచితమే. ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగులోనూ డబ్‌ అయ్యాయి.


Also read: Puneeth Rajkumar Death : కంఠీరవం స్టేడియానికి పునీత్‌ రాజ్‌కుమార్‌ పార్థీవ దేహం


Also read: Puneet Rajkumar Died: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతితో.. శోకసంద్రంలో అభిమానులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe