Puneeth Raj Kumar’s eyes: పునీత్ కుమార్ నేత్రదానం.. ఫోటోలు, వీడియోలు వైరల్

Puneeth Rajkumar's eyes donation: తమ అభిమాన నటుడు పునీత్‌ని (Puneeth Raj Kumar's death) కడసారి చూసుకునేందుకు కన్నడ నటీనటులు, పలు రంగాల ప్రముఖులు, అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 29, 2021, 11:23 PM IST
  • పునీత్ రాజ్ కుమార్ మృతితో (Puneeth Rajkumar's death news) శోకసంద్రంలో మునిగిపోయిన కన్నడ సినీ పరిశ్రమ
  • పునీత్ మృతిని జీర్ణించుకోలేకపోతున్న అభిమానులు (Puneeth Rajkumar fans).
  • తాను ఈ లోకాన్ని వీడిపోతూ మరొకరికి ఈ లోకాన్ని చూసే భాగ్యం కల్పించిన పునీత్ రాజ్ కుమార్
Puneeth Raj Kumar’s eyes: పునీత్ కుమార్ నేత్రదానం.. ఫోటోలు, వీడియోలు వైరల్

Puneeth Rajkumar's eyes donation: కన్నడ సినీ పరిశ్రమలో పవర్ స్టార్‌గా వెలుగొందిన పునీత్ రాజ్ కుమార్ చనిపోయినా.. ఆయన కళ్ళు ఇకపై కూడా ప్రపంచాన్ని చూడనున్నాయి. బతికినంత కాలం నిరుపేద విద్యార్థులకు, ఆపదలో ఉన్న వారికి, తన సహాయం అవసరం పడిన వారిని ఆదుకున్న పునీత్ రాజ్ కుమార్.. చనిపోతూ కూడా మరొకరికి దృష్టిని ప్రసాదించి వెళ్లారు. పునీత్ రాజ్ కుమార్ నేత్రదానం చేయడానికి అంగీకరించి ఉండటంతో ఆయన కోరిక మేరకు కుటుంబసభ్యులు ఆయన కళ్లను దానం చేశారు. 

పునీత్ రాజ్ కుమార్ కోరిక మేరకు బెంగళూరులోని నారాయణ నేత్రాలయ ఆస్పత్రి వైద్యులు ఆయన నేత్రాలను మరొకరికి ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారు. పునీత్ నుంచి సేకరించిన నేత్రాలను తీసుకువెళ్తుండగా అభిమానులు తమ మొబైల్ కెమెరాల్లో బంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో (Puneeth Raj Kumar eyes donation) వైరల్ అవుతున్నాయి. 

గతంలో పునీత్ రాజ్ కుమార్ తండ్రి కన్నడ కంఠీరవగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాజ్ కుమార్ (Raj Kumar) కూడా ఆయన చనిపోయినప్పుడు తన కళ్లను మరొకరి దానం చేశారు.

Also read : Puneeth Rajkumar Ashwini Revanth : పునీత్‌ రాజ్‌కుమార్, అశ్వినిల లవ్‌ స్టోరీ

పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు (Puneeth Raj Kumar cremation updates) శనివారం అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం పునీత్ రాజ్ కుమార్ పార్థివదేహాన్ని కంఠీరవ స్టేడియంకు తరలించారు. తమ అభిమాన నటుడు పునీత్‌ని (Puneeth Raj Kumar's death news) కడసారి చూసుకునేందుకు కన్నడ నటీనటులు, పలు రంగాల ప్రముఖులు, అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు.

Also read : Manchu Lakshmi Tweet: పునీత్ రాజ్ కుమార్ మృతిపై మంచు లక్ష్మి ట్వీట్.. నెటిజన్ల ఆగ్రహం

Also read : Chiranjeevi Other Celebs Mourn: పునీత్‌ రాజ్‌కుమార్‌ మృతిపై చిరంజీవితో పాటు టాలీవుడ్ నటుల దిగ్భ్రాంతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News