Manchu Lakshmi Tweet: పునీత్ రాజ్ కుమార్ మృతిపై మంచు లక్ష్మి ట్వీట్.. నెటిజన్ల ఆగ్రహం

Manchu Lakshmi Tweet: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతిపై (Puneet Rajkumar Died) టాలీవుడ్ నటి, నిర్మాత మంచు లక్ష్మి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో విమర్శలకు తావిస్తోంది. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన హీరోకు చికిత్స అందిస్తున్న క్రమంలోనే ఆయన మరణించినట్లు మంచు లక్ష్మి చేసిన ట్వీట్ పై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 29, 2021, 05:53 PM IST
Manchu Lakshmi Tweet: పునీత్ రాజ్ కుమార్ మృతిపై మంచు లక్ష్మి ట్వీట్.. నెటిజన్ల ఆగ్రహం

Manchu Lakshmi Tweet: కన్నడ చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ (Puneet Rajkumar Died) కన్నుమూశారు. శుక్రవారం ఉదయం తీవ్ర గుండెపోటుకు (Puneet Rajkumar Heart Attack) గురైన పునీత్ రాజ్ కుమార్ బెంగళూరు విక్రమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనను బతికించేందుకు వైద్యులు అత్యంత తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది. అభిమాన హీరో మరణాన్ని తట్టుకోలేక అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. పునీత్ రాజ్ కుమార్‌ను కడసారి చూసుకునేందుకు అభిమానులంతా తరలివస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆయనకు నివాళులు అర్పిస్తూ పలువురు సెలబ్రెటీలు ట్వీట్ (Celebrity Condolences To Puneeth Rajkumar) చేస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ కుటుంబంతో మంచు మోహన్ బాబు కుటుంబానికి కాస్త సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పునీత్ రాజ్ కుమార్ మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ నటి, నిర్మాత మంచు లక్ష్మి ఓ ట్వీట్ చేశారు. 

“అయ్యో దేవుడా.. ఇది నిజం కాకూడదు. అసలు ఇదెలా జరిగింది..? పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ఎంతో భవిష్యత్ ఉన్న ఆయనకు ఇలా జరిగి ఉండకూడదు” అంటూ మంచు లక్ష్మి ట్వీట్ చేశారు.

ఆ ట్వీట్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే పునీత్ రాజ్ కుమార్ కు వైద్యం అందిస్తున్నట్లు వైద్యుల చెప్పిన సమయంలోనే.. ఆయన మరణించినట్లు మంచు లక్ష్మి ట్వీట్ ద్వారా తెలిసింది. అయితే వైద్యుల ధ్రువీకరించక ముందే తొందరపడి ట్వీట్ (Manchu Lakshmi Tweet) చేశారంటూ పలువురు నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఆయన మరణవార్త (Puneet Rajkumar Died) ముందుగా తెలిసినా.. అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి చూసి ఉంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడ్డారు.

Also Read: Puneet Rajkumar Died: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతి.. శోకసంద్రంలో అభిమానులు

Also Read: Puneeth Rajkumar Death : కంఠీరవం స్టేడియానికి పునీత్‌ రాజ్‌కుమార్‌ పార్థీవ దేహం  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News