Pushpa 2 The Rule: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌పై విరిగిన లాఠీ.. సంధ్య థియేటర్ వద్ద ఉద్రిక్తత
Police Lathi Charge On Allu Arjun Fans: అల్లు అర్జున్ మేనియాతో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన పట్టణాలు ఊగిపోయాయి. ప్రేక్షకులను నియంత్రించలేక తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల లాఠీచార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Pushpa 2 The Rule: ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 ది రూల్ మానియా నడుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్నా నటించిన పుష్ప 2కు ఊహించని స్పందన లభిస్తోంది. ప్రీమియర్ షోలకు అభిమానులు, ప్రేక్షకులు ఎగబడడంతో తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద సందడి వాతావరణం అలుముకుంది. ప్రేక్షకులను నియంత్రించలేక పలు చోట్ల పోలీసులు లాఠీలకు పని చెప్పారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్‌లో పరిస్థితి దారుణంగా మారింది. టికెట్లు కొననివాళ్లు.. కొన్నవాళ్లు థియేటర్‌లోకి దూసుకురావడంతో పరిస్థితి అదుపు తప్పింది.
హైదరాబాద్‌లోని అన్ని థియేటర్‌లు ప్రేక్షకులతో నిండిపోయాయి. రాత్రి 9.30కు ప్రదర్శితమైన తొలి ప్రీమియర్ షోకు అభిమానులు ఎగబడ్డారు. థియేటర్ల ముందు అల్లు అర్జున్ అభిమానులు కేకలు.. ఈలలతో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా డప్పు చప్పుళ్లు.. పాలాభిషేకాలు.. 'జై బన్నీ.. జై జై బన్నీ' అంటూ నినాదాలు చేస్తూ సందడి చేశారు. పెద్ద ఎత్తున ప్రేక్షకులు రావడంతో పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
Also Read: Naga Babu: అల్లు అర్జున్ కోసం రంగంలోకి నాగబాబు.. వెనక్కి తగ్గిన జనసేన పార్టీ
అప్‌డేట్స్ ఇలా..
- పుష్ప 2 ప్రీమియర్ షో నేపథ్యంలో హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్లో సంధ్యా థియేటర్ వద్ద పరిస్థితి నెలకొంది. సినిమా చూసేందుకు హీరో అల్లు అర్జున్ వస్తుండడంతో అభిమానులు పోటెత్తారు. దీంతో ఆర్టీసీ క్రాస్ రోడ్ మొత్తం జామైంది. అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో వారిని అదుపు చేసేందుకు పోలీసు లాఠీచార్జ్ చేశారు.
- ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య 70 ఏం ఏం లో పుష్ప 2రిలీజ్ సందర్భంగా డీజే ఏర్పాటు చేసిన అభిమానులు.
- ఖమ్మంలో పుప్పు 2 బెనిఫిట్ షోలో రచ్చరచ్చ జరిగింది. ముందుగా సినిమా టికెట్స్ కొనుగోలు చేసిన అభిమానులు తిరుమల థియేటర్ లోకి వెళ్లలేదు. టికెట్ లేనివారు లోనికి వెళ్లడంతో టికెట్స్ ఉన్న వాళ్ళు ఆందోళన చేపట్టారు. ఒక్కో టికెట్ వెయ్యి రూపాయలకు పైగా పెట్టి కొనుగోలు చేశామని థియేటర్ లోకి వెళ్లనీయకపోవడంతో తమ డబ్బులు తమకు చెల్లించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. పోలీసులు చేరుకుని ఫ్యాన్స్ ను అదుపు చేసే ప్రయత్నం చేసనా ఫలించలేదు. కొంతమంది అభిమానులు థియేటర్ పై దాడి చేసి అద్దాలను పగలగొట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.