Pushpa Tickets Rates Reduction: 
పుష్ప 2.. సినిమా ప్రస్తుతం ఎంతటి సంచలనం సృష్టిస్తుందో అందరికీ తెలిసిన విషయమే. కాగా ఈ సినిమా టికెట్ ధరలు.. మొదటినుంచి చాలా చర్చలకు దారితీసాయి. ఇప్పటివరకు ఎప్పుడూ లేనంత విధంగా.. ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచడంతో…అందరూ ఆశ్చర్యపోయారు. చాలామంది టికెట్ ధరలు తగ్గాక సినిమాకి పోదాము అని.. సినిమా బాగున్నా కానీ నిలిచిపోయిన వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ చిత్రం టికెట్ ధరలు తగ్గనున్నాయి అనే శుభవార్త వినిపిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ చిత్రం తొలి రోజు మంచి ఆక్యుపెన్సీ సాధించినప్పటికీ.. విపరీతమైన టికెట్ ధరల వల్ల..రెండో రోజు నుండి ప్రేక్షకుల సంఖ్య తగ్గు ముఖం పట్టడం మొదలయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు స్టార్ హీరోల సినిమాలకు టికెట్ల రేట్ల పెంపుకు అనుమతి ఇస్తుండగా, ఇది ప్రేక్షకులకు ఆర్ధికభారంగా మారింది అనదం ఎంతోమంది వాదన. ముఖ్యంగా మధ్యతరగతి ప్రేక్షకులు.. మల్టీప్లెక్స్‌ థియేటర్లకు వెళ్లేందుకు సంకోచిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో, మైత్రి మూవీ మేకర్స్ టికెట్ల రేట్లను తగ్గించే దిశగా చర్యలు చేపట్టారట.  


Read more: Konda Surekha: మరో వివాదంలో మంత్రి కొండా సురేఖ.. ఈ సారి ఏంచేశారంటే..?


వారాంతంలో భారీ వసూళ్లు సాధించిన తరువాత, సోమవారం నుండి టికెట్ల రేట్లను సాధారణ స్థాయికి తగ్గించే ప్రయత్నం చేస్తున్నారట. ఈ నిర్ణయం వీక్‌డేస్‌ లో కూడా మంచి.. ఆక్యుపెన్సీ సాధించేందుకు ఉపయోగపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  


కాగా ఇటువంటి పరిణామాలు సినిమా పరిశ్రమకు పాఠంగా మారుతున్నాయి. టికెట్ల రేట్లు సాధారణంగా ఉంటే, ప్రేక్షకులు థియేటర్లకు రావడం సాధ్యమవుతుంది. ఈ క్రమంలో ప్రభుత్వం కూడా రేట్ల పెంపు విషయంలో కఠినమైన చర్యలు తీసుకోవాలని అభిమానులు కోరుతున్నారు.  మొత్తం మీద, పుష్ప 2 టికెట్ల వివాదం ప్రేక్షకుల అభిప్రాయాలపై ప్రభావం చూపుతూ, సినిమా పరిశ్రమలో కొత్త మార్గాలను చర్చకు తెస్తోంది.


Read more: Yadadri Road Accident: చెరువులో కారు దూసుకెళ్లిన ఘటన.. వెలుగులోకి వస్తున్న విస్తు పోయే విషయాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 


allu arjunpushpa 2 the rulePushpa 2 Movie