Yadadri Car accident 5 students dead tragedy: వాహానాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకొవాలని.. టూవీలర్ లు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకొవాలి, కార్లు, ఫోర్ వీలర్ నడుపుతున్న వారు...బెల్ట్ లు పెట్టుకొవాలని ట్రాఫిక్ పోలీసులు చెప్తుంటారు. అదే విధంగా తాగి వెహికిల్స్ అస్సలు నడపొద్దని పోలీసులు చెబుతుంటారు. అయిన కూడా చాలా మంది ఈ విషయాలను అస్సలు పట్టించుకోరు. ఈ క్రమంలో ప్రస్తుతం యాదాద్రిలో జరిగిన ఘటన పలు కుటుంబాల్లో తీవ్రవిషాదాన్ని నిపింది. యాదా
యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్‌పూర్ దగ్గర ఘోర ప్రమాదం సంభవించింగి. ఈ ఘటనలో.. హర్ష, దినేశ్, వంశీ, బాలు, వినయ్, చనిపోయినట్లు తెలుస్తొంది. మరొ యువకుడు మాత్రం ప్రాణాలతో బైటపడినట్లు తెలుస్తొంది. ఒక వైపు పొగమంచు, మరోవైపు అతి వేగం ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. అయితే.. వీరంతా.. హైదరాబాదు నుండి వలిగొండలో పార్టీ చేసుకునేందుకు తెల్లవారుజామున బయలుదేరినట్లు తెలుస్తొంది.
యాదాద్రి జిల్లా భూదాన్‌పోచంపల్లిలో ప్రమాదం.
జలాల్‌పూర్ చెరువులోకి దూసుకెళ్లిన కారు. కారులో ఉన్న ఐదుగురు మృతి.
మృతులంతా హైదరాబాద్ హయత్‌నగర్‌కు చెందినవారిగా గుర్తింపు. #caraccident pic.twitter.com/27PlT8fBOQ
— greatandhra (@greatandhranews) December 7, 2024
ముఖ్యంగా తాటికల్లు తాగేందుకు వెళ్లినట్లు విషయం బైటపడింది. భూదాన్ పోచంపల్లి మండలం జలాల్ పూర్ సమీపంలోకి రాగానే కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. అక్కడ మంచు ఎక్కువగా ఉండటంతో కూడా ప్రమాదం జరిగినట్లు తెలుస్తొంది. అయితే.. వీరంతా నిన్న రాత్రి కూడా మద్యం సేవించినట్లు తెలుస్తొంది. యువకులు కారు చెరువులో పడిపోయినప్పుడు.. బైటకు వచ్చేందుకు ప్రయత్నించిన కూడా.. ఈత రాకపోవడంతో జలసమాధి అయినట్లు సమాచారం.
Read more: Video Viral: రేవతి మృతి పై స్పందించిన అల్లు అర్జున్.. ఏమన్నారంటే..?.. వీడియో ఇదిగో..
మణికంఠ అనే యువకుడు మాత్రం.. కారు అద్దాలు పగలకొట్టుకుని బైటకు వచ్చినట్లు తెలుస్తొంది. ఇతడ్ని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారంట. అయితే.. ఇతడికి మద్యం టెస్ట్ లు నిర్వహించగా.. ఇతని శరీరంలో మద్యం ఆనవాళ్లు బైటపడ్డాయంట. దీంతో వీరు.. రాత్రి అంతా మద్యం తాగి, మరల ఉదయం అదే మత్తులోతాటి కల్లు తాగేందుకు వెళ్లి ఈ ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచన వేస్తున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook