Pawan Kalyan: పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్నాడు.. అల్లు అర్జున్. ప్రపంచమంతా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ హీరో.. మెగా అభిమానుల దగ్గర నుంచి మాత్రం.. గత కొద్ది రోజులుగా ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నారు. అల్లు అర్జున్ అపరిచితుడు కన్నా.. ఘోరంగా ప్రవర్తిస్తారు అనేది  మెగా అభిమానుల వాదన. అయితే అందుకు కారణం లేకపోలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొదట్లో తన మేనమామ చిరంజీవిని అలానే పవన్ కళ్యాణ్ ని తెగ పొగుడుతూ వచ్చారు.. అల్లు అర్జున్. తన సినిమా ఈవెంట్స్ లో ఏదో ఒక విధంగా.. వాళ్ళ పేర్లు ఎట్టి మరి వాళ్ళని ప్రశంసించేవారు. అయితే కొన్ని సూపర్ హిట్ లు వచ్చిన తర్వాత నుంచి.. అల్లు అర్జున్ ప్రవర్తన తీరు మారుతూ వచ్చిందనేది.. మెగా అభిమానుల ఉద్దేశం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ని తెగ మెచ్చుకునే దగ్గర నుంచి.. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గురించి ‘చెప్పను బ్రో’ అనే స్టేజ్ కి వచ్చారు.. అల్లు అర్జున్.


అంతేకాదు అల్లు అర్జున్ ప్రవర్తన ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది అని కూడా అంటుంటారు కొందరు. ఎందుకంటే కొన్నిసార్లు పవన్ కళ్యాణ్ కనిపించగానే.. హగ్ చేసుకుంటారు. అయితే మళ్లీ కొద్ది రోజుల తర్వాత.. పవన్ అభిమానులకు ఏదో ఒక రకంగా పంచ్ ఇస్తూ ఉంటారు. ఇలా ఈ హీరో తిక్క.. తిక్కగా ప్రవర్తిస్తున్నాడని.. పవన్ అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద వార్ జరిపారు.


అంతెందుకు మొన్నటికి మొన్న…పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ లో పాల్గొనేటప్పుడు.. పవన్ కళ్యాణ్ కి ట్విట్టర్లో మద్దతు పెట్టి.. ఆయన అపోజిషన్ పార్టీలో ఉండే శిల్పా రవి కృష్ణకి.. నంద్యాలకి వెళ్లి మరి సపోర్ట్ చేశాడు. దాంతో పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు.. అల్లు అర్జున్ పై ఇన్ డైరెక్ట్ గా..కొంచెం ఘాటుగానే స్పందించాడు.. అంతేకాకుండా ఆ విషయం జరిగిన దగ్గర నుంచి.. పవన్..అల్లు అర్జున్ అభిమానుల మధ్య గొడవలు మరింత ఎక్కువయ్యాయి.


ఈ క్రమంలో మొన్న పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన.. ఆంధ్ర ప్రదేశ్ ఎలక్షన్స్ లో ఘనవిజయం సాధించడంతో.. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గురించి ట్విట్టర్లో పొగుడుతూ ఒక పోస్ట్ వేశారు. ఇక దీంతో పవన్ అభిమానులు ఆ పోస్టుని షేర్ చేస్తూ తెగ కామెంట్లు పెడుతున్నారు. ఇక పుష్ప ఫైర్ తగ్గినట్టే అని.. మొత్తానికి అల్లు అర్జున్ తిక్క.. పవన్ కళ్యాణ్ లెక్కతో తగ్గింది అని పోస్టులు వేస్తున్నారు.


ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రానున్న ఐదు సంవత్సరాలలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించడం ఖాయమని మనకి తెలిసిన విషయమే. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తో ఏమన్నా విభేదాలు వస్తే.. అవి అల్లు అర్జున్ సినిమాలకు సైతం ముప్పు. కాబట్టి పవన్ కళ్యాణ్ రెంజ్ తెలుసుకొని.. ఇప్పటికీ అల్లు అర్జున్ కొవ్వు తెగింది అంటూ పవన్ అభిమానులు.. తమ తమ థియరీలను సోషల్ మీడియాలో పెడుతున్నారు.


కాగా అల్లు అర్జున్ పుష్ప సినిమా రెండో భాగం ఆగస్టు 15న విడుదల కానుంది. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.


Also read: Richest MP List: దేశంలోనే అత్యంత ధనిక ఎంపీగా గుంటూరు టీడీపీ అభ్యర్ధి పెమ్మసాని చంద్రశేఖర్, టాప్ 6 జాబితా ఇదే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook