Radhe Shyam update Makers to release Radhe Shyam teaser on Prabhas birthday : ప్రభాస్‌ హీరోగా నటిస్తోన్న ప్రేమకథా చిత్రం రాధేశ్యామ్‌. రాధాకృష్ణ కుమార్‌ (radha krishna kumar) డైరెక్షన్‌లో వస్తోన్న ఈ మూవీలో ప్రభాస్‌ విక్రమాదిత్యగా కనిపించనున్నారు. ఇక ప్రభాస్‌కు (Prabhas) జోడీగా పూజాహెగ్డే (pooja hegde) నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి.. బీట్స్‌ ఆఫ్‌ రాధేశ్యామ్‌, గ్లిమ్స్‌ ఆఫ్‌ రాధేశ్యామ్‌ మాత్రమే రిలీజ్ అయ్యాయి. చాలా రోజులుగా రాధేశ్యామ్‌ నుంచి ఎలాంటి అప్‌డేట్‌లు బయటకు రాలేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో రాధేశ్యామ్‌ టీజర్‌ (Radhe Shyam Teaser) రిలీజ్‌ డేట్‌ని బుధవారం మూవీ యూనిట్‌ వెల్లడించింది. ప్రభాస్‌ పుట్టినరోజు ( Prabhas birthday) కానుకగా అక్టోబర్‌ 23న ఉదయం 11.16 గంటలకు రాధేశ్యామ్‌ మూవీ టీజర్‌ రానుంది.



 


Also Read : Aryan Khan Drugs Case: ఆర్యన్ ఖాన్ కేసులో కీలక మలుపు .. తెరపైకి మరో హీరోయిన్!


వింటేజ్‌ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ రాధేశ్యామ్‌లో ప్రభాస్‌ యంగ్‌ లుక్‌లో కనిపించనున్నారు. ఈ మూవీ షూటింగ్‌ చాలా వరకు ఇటలీలోనే జరిగింది. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఇక చాలా ఏళ్ల తర్వాత భాగ్యశ్రీ ఈ మూవీతో తెలుగు తెరపై సందడి చేయనున్నారు. అలాగే మురళీ శర్మ, ప్రియదర్శి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 14న ప్రభాస్‌ (Prabhas).. రాధేశ్యామ్‌ రిలీజ్‌ కానుంది. 


Also Read : Jagananna Thodu Scheme: జగనన్నతోడు లబ్దిదారుల ఖాతాల్లో డబ్బు జమ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి