Prabhas25: 'అర్జున్ రెడ్డి' దర్శకుడితో ప్రభాస్ 25వ సినిమా ఫిక్స్..టైటిల్ ఏమిటంటే...

Prabhas: డార్లింగ్ ప్రభాస్ 25వ సినిమాకు సంబంధించిన అప్ డేట్ వచ్చేసింది. ప్రభాస్ 25వ సినిమాకు 'స్పిరిట్' అనే టైటిల్ ఖరారు చేశారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 7, 2021, 12:39 PM IST
  • ప్రభాస్ 25వ సినిమా అనౌన్స్‏మెంట్
  • దర్శకుడిగా సందీప్‌రెడ్డి వంగా
  • ప్రస్తుతం సలార్, ఆదిపురుష్ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్
Prabhas25: 'అర్జున్ రెడ్డి' దర్శకుడితో ప్రభాస్ 25వ సినిమా ఫిక్స్..టైటిల్ ఏమిటంటే...

Prabhas 25th movie title officially announced: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా కొత్త ప్రాజెక్టులను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే నాగ్‌అశ్విన్‌తో సినిమాను ఖరారుచేసిన ఆయన.. తాజాగా మరో చిత్రానికి ఓకే చెప్పారు. ఈ మేరకు ఆయన 25వ చిత్రాని(prabhas 25th movie)కి సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నట్లు గురువారం ఉదయం తెలిపారు. ఈ చిత్రానికి ‘స్పిరిట్‌(Spirit) అనే పేరు ఖరారు చేశారు. 

ఈ సందర్భంగా..స్పిరిట్ టైటిల్ పోస్టర్ రివీల్ చేశారు మేకర్స్. టీ సిరీస్‌, వంగా పిక్చర్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాయి. ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలతో పాటు చైనీస్, కొరియన్ భాషలలో కూడా తెరకెక్కనుంది.

Also Read: Glimpse of Ghani: గని ఫస్ట్ పంచ్ వీడియో.. Varun Tej పంచ్ పవర్

ప్రభాస్‌ ప్రస్తుతం ‘సలార్‌’, ‘ఆదిపురుష్‌’ సినిమాల్లో నటిస్తున్నారు. ప్రశాంత్‌నీల్‌ తెరకెక్కిస్తున్న ‘సలార్‌(Salaar)’ ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా సిద్ధం కానుంది. ఇందులో ప్రభాస్‌ యాంగ్రీ లుక్‌లో కనిపించనున్నారు. అలాగే బాలీవుడ్‌ దర్శకడు ఓంరౌత్‌ సిద్ధం చేస్తున్న ‘ఆదిపురుష్‌’(Adipurush)లో ఆయన రాముడిగా కనిపించనున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్‌లు పూర్తైన తర్వాత నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించనున్న ‘ప్రాజెక్ట్‌ కే’లో ఆయన భాగం కానున్నారు. ఇక ప్రభాస్‌ నటించిన ‘రాధేశ్యామ్‌’ సినిమా త్వరలో విడుదల కానుంది. మరోవైపు ‘అర్జున్‌రెడ్డి’తో తెలుగులో సూపర్‌హిట్ అందుకున్న సందీప్‌రెడ్డి వంగా(sandeep reddy vanga) అదే చిత్రాన్ని హిందీలో ‘కబీర్‌సింగ్‌’ పేరుతో రీమేక్‌ చేసి అక్కడ కూడా పాపులర్‌ అయ్యారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News