Sai Pallavi with Ram Charan: సౌత్ ఇండియా హీరోయిన్స్ లో సాయి పల్లవికి ప్రత్యేక స్థానం ఉంది. ఎక్స్పోజింగ్ కి దూరంగా ఉంటూ హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలే చేస్తూ.. ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది ఈ హీరోయిన్. తాను నటించిన ఫిదా సినిమాతో నిజంగానే అందరిని ఫిదా చేసేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ తరువాత లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ లాంటి సినిమాలలో కనిపించిన సాయి పల్లవి ఆ తరువాత తెలుగు సినిమాలకి కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చింది. మళ్లీ ఈ మధ్యనే ఆమె లవ్ స్టోరీ హీరో నాగచైతన్య తో.. మరో సినిమా సైన్ చేసి తెలుగు ప్రేక్షకులను ఖుషి చేసింది.  నాగచైతన్య – చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న  ఈ సినిమాలో సాయి పల్లవికి ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్రే ఉన్నట్టు తెలుస్తోంది


కాగా తాజాగా రామ్ చరణ్ సినిమాలో కూడా నటించడానికి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ ఒక పుకారు షికారు చేస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చాలా రోజుల క్రితమే వచ్చింది. కానీ గేమ్ చేంజర్ షూటింగ్ ఆలస్యం కావడం ఆ ఎఫెక్ట్ బుచ్చిబాబు మూవీ పై పడింది. శంకర్ సినిమా పూర్తయిన తరువాతే ఇక రామ్ చరణ్ బుజ్జిబాబు సినిమా షూటింగ్ మొదలు పెట్టగలరు.


ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం బుచ్చిబాబు సినిమా జనవరిలో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన సాయి పల్లవి సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం జాన్వి కపూర్ ని  అనుకున్నారని కూడా వార్తలు వినిపిచ్చాయి. మరోపక్క మృణాల్ ఠాకూర్ కూడా ఈ సినిమాలో నటించే ఛాన్సెస్ ఉన్నాయి అంటూ చెప్పకు వచ్చారు.


కానీ ప్రస్తుతం వినబడుతున్న వార్తల ప్రకారం వారిద్దరూ కాదని సాయి పల్లవి సినిమాకి హీరోయిన్ గా సెలెక్ట్ అయిందని తెలుస్తోంది.‌ కథ పరంగా హీరోయిన్ క్యారెక్టర్ కి చాలా డెప్త్ ఉండడంతో సాయి పల్లవి లాంటి వాళ్లు అయితేనే ఈ సినిమాకి హైప్ వస్తుందని ఈ నిర్ణయం తీసుకున్నారట బుచ్చిబాబు.  ఈ వార్త గురించి ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. కాబట్టి ఇది నిజమో కాదో తెలియాలి అంటే మాత్రం మరి కొద్ది రోజులు వేచి చూడాలి.


Also Read: Unknown Facts About Chandra Mohan: చంద్రమోహన్ గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..ఆయనకు గుర్తింపు తెచ్చిన సినిమా ఇవే! 


Also Read:  Delhi Air Pollution: ఢిల్లీపై కరుణించిన ప్రకృతి, వర్షం కారణంగా పెరిగిన గాలి నాణ్యత


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


FacebookTwitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి