Ram Charan - Game Changer: రామ్ చరణ్.. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా అడుగుపెట్టి.. హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘మగధీర’తో స్టార్ హీరో అయినా.. చరణ్..ఆర్ఆర్ ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. తాజాగా ఈ సినిమా రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ కావడంతో ఓ పిక్ ను అభిమానులతో పంచుకున్నాడు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన రోజున హెలికాప్టర్ తో వచ్చిన పిక్ తో పాటు షూటింగ్ పూర్తైయిన రోజున హెలికాప్టర్ వైపు వెళుతున్న పిక్ ను అభిమానులతో పంచుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘గేమ్ ఛేంజర్’ సినిమా 8 సెప్టెంబర్ 2021లో స్టార్ట్ అయింది. ఇక రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ 6 జూలై పూర్తైయింది. మొత్తంగా ఎలాంటి గ్రాఫిక్స్ హంగులు లేని ఈ సినిమాకు ఇన్ని రోజులు డేట్స్ కేటాయించడం మాములు విషయం కాదు. ఈ మూవీలో హీరో పాత్ర చిత్రీకరణకు 2 నెలలు తక్కువగా దాదాపు మూడేళ్లు పట్టిందన్నమాట.


గేమ్ ఛేంజర్ మూవీ లేట్ కావడానికి పెద్ద రీజనే ఉంది. శంకర్ ఓ వైపు గేమ్ ఛేంజర్ మూవీ చేస్తూనే.. కమల్ హాసన్ తో ‘భారతీయుడు 2’ సినిమా పూర్తి చేయాల్సి రావడంతో ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ లేట్ అయింది.  అంతేకాదు ఈ సినిమాలో రామ్ చరణ్.. ఫస్ట్ తన కెరీర్ లో  తండ్రీ కొడుకులుగా డ్యూయల్ రోల్లో యాక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన అంజలి, కియారా అద్వానీ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇతర ముఖ్యపాత్రల్లో సునీల్, శ్రీకాంత్, ఎస్.జే.సూర్య నటించారు. ఈ సినిమాలో రామ్ చరణ్.. ‘రామ్ నందన్’ అనే పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. మొత్తంగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయి.. ఓ రాష్ట్రానికి సీఎం గా ఎలా ఎదిగాడనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను శంకర్ మలిచాడని సమాచారం.


'గేమ్ ఛేంజర్' సినిమా  తర్వాత రామ్ చరణ్.. బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు.జాన్వీ కపూర్ తొలిసారి రామ్ చరణ్ సరసన నటిస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు.  


Read more: Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వీడియో వైరల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి