Ram Charan - RC 16: దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' మూవీతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యాడు.  ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా ఒదిగిపోయిన తీరును ఎవరు మరిచిపోలేదు. ఈ సినిమా తర్వాత చేయబోయే ప్రతి సినిమాను గ్లోబల్ లెవల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు రామ్ చరణ్. ప్రస్తుతం రామ్ చరణ్  శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంచర్' మూవీ చేస్తున్నారు.ఈ సినిమాలో రామ్ చరణ్‌ ప్రభుత్వ అధికారి పాత్రలో నటిస్తున్నాడు. అంతేకాదు తొలిసారి తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు రామ్ చరణ్‌. ఈ సినిమాలో హీరో పాత్రతో పాటు  ముఖ్యమంత్రి పాత్రకు మంచి స్కోప్ ఉందట. ఈ రోల్‌ను మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌తో చేయించాలని చూస్తున్నారట. ఇప్పటికే శంకర్ వెళ్లి ఈ సినిమా స్క్రిప్ట్ మోహన్‌లాల్‌కు వినిపించాడట. ఆయన కూడా కథ నచ్చి ఈ సినిమాలో క్యారెక్టర్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలో ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాలో రామ్ చరణ్‌..  రామ్ నందన్ అనే IAS అధికారి పాత్రలో నటిస్తున్నాడట. ఈ క్యారెక్టర్ మాజీ ఎన్నికల కమిషనర్ టీఎన్ శేషన్‌ స్పూర్తితో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాను ఈయేడాది చివరి వారంలో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.


దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీలో రామ్ చరణ్ ప్రభుత్వ అధికారి నుంచి ముఖ్యమంత్రిగా ఎలా ఎదిగాడనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు సమాచారం. రామ్ చరణ్ ..గేమ్ ఛేంజర్ మూవీ కంప్లీట్ చేస్తూనే.. బుచ్చిబాబు సన దర్శకత్వంలో నెక్ట్ మూవీ చేయనున్నాడు. ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలో రామ్ చరణ్ కూడా ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ కానున్నాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామా కాబట్టి ఈ సినిమా లో  జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది.  ప్రస్తుతం జాన్వీ..  ఎన్టీఆర్ హీరోగా కొరటాల శి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న దేవర మూవీలో నటిస్తోంది. ఈ చిత్రం రెండు పార్టులుగా రానుంది. అటు రామ్ చరణ్‌, శంకర్‌ల గేమ్ ఛేంజర్ మూవీలో మోహన్ లాల్ రాకతో ఈ సినిమాకు మలయాళంలో మంచి మార్కెట్ దక్కే అవకాశాలున్నాయి.


ఇదీ చదవండి: తెలంగాణ పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి