RC 15 Title Update మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే (మార్చి 27) సందర్భంగా సినిమాకు సంబంధించిన అప్డేట్లు వస్తాయని ఎప్పటి నుంచో ఊరిస్తూనే వస్తున్నారు. దిల్ రాజు అయితే ఎప్పటి నుంచో ఊరిస్తూనే వచ్చాడు. శంకర్ ప్లానింగ్ వేరే లెవెల్‌లో ఉందని, బర్త్ డేకు అప్డేట్లను ప్లాన్ చేశాడని, అది పండుగలా ఉంటుందని చెప్పేశాడు దిల్ రాజు. మొత్తానికి నేడు ఆ రోజు వచ్చింది. ఇక ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ టైటిల్‌ను ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


గేమ్ చేంజర్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇక ఈ టైటిల్ ఎలాగూ గ్లోబల్‌గా పనికి వస్తుంది. ఇంతకు ముందు అయితే సీఈవో, సర్కారోడు అనే టైటిల్‌ను అనుకున్నారట. అధికారి అనే టైటిల్ కూడా పెడదామని అనుకున్నారు. కానీ ఇప్పుడు రామ్ చరణ్‌ గ్లోబల్ స్థాయికి వెళ్లడంతో.. ఆ అప్పీల్ రావాలనే ఉద్దేశంతోనే ఇలా గేమ్ చేంజర్ అనే టైటిల్‌ను శంకర్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.


రామ్ చరణ్‌ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ టైటిల్, లోగో కాన్సెప్ట్ వీడియో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో సరిగ్గా గమనిస్తే.. చదరంగం కాన్సెప్ట్ చూపించాడు. కింగ్, కింగ్ చుట్టూ బటులు అన్నట్టుగా చూపించాడు. సరిగ్గా గమనిస్తే ఇందులో శాసన సభ సెటప్ కూడా కనిపిస్తున్నట్టుగా ఉంది. ఇందులో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కూడా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే రామ్ చరణ్‌ ఎన్నికల అధికారిగా కనిపిస్తాడని, ఎన్నికల అధికారే గేమ్ చేంజర్ అవుతాడనే కాన్సెప్ట్‌లో సినిమా ఉంటుందని తెలుస్తోంది. అందుకే ఇలా రామ్ చరణ్ సినిమాకు గేమ్ చేంజర్ అనే టైటిల్‌ను పెట్టినట్టు తెలుస్తోంది.


అయితే ఈ గేమ్ చేంజర్ అనేది కేవలం సినిమాకు మాత్రమే కాకుండా.. రామ్ చరణ్‌ సినీ కెరీర్‌కు కూడా గేమ్ చేంజర్‌గానే ఉంటుందనిపిస్తోంది. శంకర్ సంభవం జరిగేట్టు కనిపిస్తోంది. శంకర్ రామ్ చరణ్ కాంబోలో రాబోతోన్న ఈ గేమ్ చేంజర్ ఇండియన్ బాక్సాఫీస్ మాత్రమే కాకుండా వరల్డ్ వైడ్‌గా సునామినీ క్రియేట్ చేసేలా ఉంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో దిల్ రాజు ఉన్న సంగతి తెలిసిందే.


Also Read:  Manchu Manoj Vs Manchu Vishnu: రోడ్డున పడ్డ మంచు గౌరవం?.. ఇంటిపై దాడులు చేస్తాడు మంచు విష్ణు వీడియో షేర్ చేసిన మనోజ్


Also Read: Manchu Family Fighting : మంచు బ్రదర్స్ వివాదం.. రంగంలోకి మోహన్ బాబు?.. వెనక్కి తగ్గిన మనోజ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook