కొరటాల శివ డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) నటిస్తున్న 'ఆచార్య' చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) ఒక కీలకమైన పాత్రలో 40 నిమిషాల పాటు కనిపించనున్నాడు. ఈ సినిమాలో చరణ్ కోసం కొరటాల శివ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. "కొరటాల శివ ఆచార్య మూవీ స్టోరీ ( Acharya movie story ) వినిపించినపుడు ఒక కీలకమైన పాత్ర గురించి చెప్పాడట. ఆ పాత్ర కోసం చరణ్ అయితే బాగా సరిపోతాడనిపించింది" అని చిరు ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అలాగే 'ఆచార్య' సినిమాలో చరణ్ నటించడానికి రాజమౌళి కూడా అనుమతి ఇచ్చారని చిరు అన్నారు. Also read : RRR movie shooting: క్వారంటైన్‌లో ఎన్టీఆర్, రాంచరణ్ ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు రాంచరణ్ ముందు రెండు ఆఫర్స్ ఉన్నట్టుగానే.. రెండు టాస్కులు కూడా ఉన్నాయంట. అదేంటంటే.. ఆచార్య సినిమా కోసం రామ్ చరణ్ బరువు పెరగాలంట ( Gain weight )!! ఆచార్య కోసం బరువు పెరగడం ఒక సమస్య ఐతే.. ఆర్ఆర్ఆర్ మూవీ కోసం మళ్లీ బరువు తగ్గి ( Weight loss ) యధాస్థాయికి చేరుకోవడం ఇంకో పెద్ద టాస్క్ కానుంది.


ఆచార్య మూవీ కోసం ఒక నెల రోజుల్లో కావలసిన బరువు పొందడం చరణ్‌కి కాస్త సవాలుగా మారింది. ఐతే చరణ్‌ను తల్లి సురేఖ తన భర్త చిరుతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నందున తల్లి కోరిక తీర్చడం కోసం చరణ్ ఈ సవాలును ఇష్టంగానే స్వీకరిస్తాడులే. Also read : Actors remunerations cut: సినిమా వాళ్లకు షాకింగ్ న్యూస్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe