పవర్ స్టార్ మూవీని ప్రకటించినప్పటి నుంచే రాంగోపాల్ వర్మకు ( Ramgopal Varma ), పవన్ కల్యాణ్ అభిమానులకు ( Pawan Kalyan fans ) మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) ప్రతిష్టను దెబ్బతీసేలా వర్మ పవర్ స్టార్ మూవీని తెరకెక్కిస్తుండటాన్ని పవన్ కల్యాణ్ అభిమానులు మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జులై 25న పవర్ స్టార్ చిత్రాన్ని విడుదల చేస్తానని ప్రకటించిన వర్మ.. ఇటీవలే పవర్ స్టార్ ట్రైలర్‌ను సైతం విడుదల చేశారు. ( Also read: Ram Charan tweet: రామ్ చరణ్ ట్వీట్ వెనుకున్న మతలబేంటి )


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పవర్ స్టార్ పేరిట సినిమాను తెరకెక్కిస్తున్న వర్మను సినిమాతోనే దెబ్బ కొట్టాలని భావించిన కొంతమంది పవన్ మద్దతుదారులు.. వర్మపై పరాన్నజీవి అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.  పవర్ స్టార్ మూవీ ట్రైలర్ ( Power star trailer ) విడుదలైన మరుసటి రోజే పరాన్న జీవి టీజర్ ( Parannajeevi teaser ) సైతం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ( Also read: Attack on RGV office: రాంగోపాల్ వర్మ ఆఫీసుపై దాడి )


పరాన్నజీవి టీజర్‌లో రాంగోపాల్ వర్మను ఉద్దేశించి పలు సన్నివేశాలు, డైలాగ్స్ చూపించారు. " నేను వోడ్కా తాగుతాను, అమ్మాయిలతో తిరుగుతాను, పోర్న్ చూస్తాను'' అని వర్మ చెప్పినట్టుగా పలు డైలాగ్స్ ఉన్నాయి. అయితే, ఈ డైలాగ్స్‌పై వర్మ ( RGV ) స్వయంగా స్పందించాడు. పరాన్నజీవి మూవీ టీజర్‌లో ఉన్నవన్నీ తాను ఎప్పుడూ చెబుతున్న విషయాలేనని.. ఏదైనా ఉంటే నా గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు చెప్పండి అంటూ బదులిచ్చాడు. తాను ఎప్పుడు ఏం చేస్తాను అనేది ఎవ్వరూ ఊహించలేరని.. తానేం చేస్తానో తనకే సరిగ్గా తెలియదని రాంగోపాల్ వర్మ చెప్పుకొచ్చాడు. ( Also read: RGV vs NIKHIL: నిఖిలో..కిఖిలో..అంతా వపన్ తొత్తులు )