Ram Gopal Varma Complaint: యూనివర్సిటీ స్పీచ్ వివాదం..వాళ్లపై తిరిగి కేసు పెడతానంటున్న వర్మ!
Ram Gopal Varma Complaint on Lady Advocates: కొద్దిరోజుల క్రితం సినీ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విజయవాడ-గుంటూరు మధ్యలో ఉన్న నాగార్జున యూనివర్సిటీకి వెళ్లి చేసిన కామెంట్ల విషయంలో మరో సారి కీలక వాఖ్యలు చేశారు.
Ram Gopal Varma Fires on Lady Advocates: కొద్దిరోజుల క్రితం సినీ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విజయవాడ-గుంటూరు మధ్యలో ఉన్న నాగార్జున యూనివర్సిటీకి వెళ్లి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నాగార్జున యూనివర్సిటీలో ఒక కార్యక్రమానికి రామ్ గోపాల్ వర్మని ముఖ్య అతిథిగా హాజరు అవ్వమని కొడితే ఆయన వెళ్లారు. అక్కడ విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు, అయితే కొన్ని ప్రశ్నలకు సమాధానంగా ఆయన సెక్స్ చేయండి, తాగండి, తినండి పెద్ద వాళ్ళు ఏవేవో చెబుతారు అవి పాటించవద్దు అని చెప్పినట్లుగా మీడియాలో సోషల్ మీడియాలో ప్రచారం అయింది.
ఇదే విషయం మీద పెద్ద ఎత్తున సామాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు కూడా. ఈ నేపథ్యంలో తాజాగా కొందరు మహిళా న్యాయవాదులు రాంగోపాల్ వర్మ మీద ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం మీద రాంగోపాల్ వర్మ మండిపడ్డారు. నన్ను కించపరుస్తూ నా మనోభావాలు గాయపరిచిన ఈ అడ్వకేట్లు అందరి మీద కేసు పెట్టబోతున్నాను అంటూ ఆయన పేర్కొన్నారు. నాగార్జున యూనివర్సిటీలోని స్టూడెంట్స్ కి లెక్చరర్లకు, ప్రొఫెసర్లకి నేను మాట్లాడిన దాంట్లో ప్రాబ్లం అనిపించలేదు కానీ ఊరు పేరు పని పాట లేని వాళ్లకు మాత్రం పబ్లిసిటీ పాకులాట అని రామ్ గోపాల్ వర్మ విమర్శించారు.
ఈ ఫోటోలలో వాళ్ళ నవ్వులు చూడండి అంటూ రాంగోపాల్ వర్మ తన మీద ఫిర్యాదు చేస్తున్న మహిళా న్యాయవాదుల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. రాంగోపాల్ వర్మ ఎక్కడైతే నాగార్జున యూనివర్సిటీలో మాట్లాడారూ ఆ యూనివర్సిటీ పరిధిలోని పోలీస్ స్టేషన్ లోనే మహిళా న్యాయవాదులు రాంగోపాల్ వర్మ మీద ఫిర్యాదు చేసినట్లు రాంగోపాల్ వర్మ షేర్ చేసిన వీడియోలో ఉంది ఇప్పుడు రాంగోపాల్ వర్మ మహిళా న్యాయవాదుల మీద ఎలాంటి కేసు పెట్టబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది.
Also Read: Priyanka Jawalkar Latest Saree Photos: శారీలో అంతా చూపిస్తున్న తెలుగమ్మాయి.. క్లీవేజ్ ట్రీట్ తో పాటు నడుమందాలు కూడా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook