Ram Gopal Varma Warning to Pawan Fans: ఈ మధ్యకాలంలో వరుస ట్వీట్లతో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ వస్తున్న రామ్ గోపాల్ వర్మ తన ట్వీట్ లో దాడిని కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి ఆయన పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు గురించి ట్వీట్లు చేశారు. ప్రియమైన జనసైనికులారా దయచేసి మన లీడర్ ని వెన్నుపోటు నాదెండ్ల భాస్కర్ రావు కొడుకు నాదెండ్ల మనోహర్ కి దూరంగా ఉండమని చెప్పండి, ఇంతకుముందు పవనిజం బుక్ రాసిన రాజు రవితేజ గురించి ఇలాగే వార్నింగ్ ఇచ్చాను నా మాటే నిజమైంది అంటూ ఆయన ట్వీట్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతేకాక ఆనాడు జూలియస్ సీజర్ ని బ్రోటస్, ఎన్టీఆర్ నాదెండ్ల భాస్కరరావు ఎన్టీఆర్ ని మళ్ళీ చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచినట్లు ఈసారి పవన్ కళ్యాణ్ ని నాదెండ్ల మనోహర్, చంద్రబాబు ఇద్దరూ కలిసి వెన్నుపోటు పొడుస్తారని నాకు రాత్రి కలలో దేవుడు వచ్చి చెప్పాడు అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులను ఉద్దేశిస్తూ వారికి హెచ్చరిక లాగా రాంగోపాల్ వర్మ ట్వీట్లు చేయడం హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి కొన్నాళ్ల క్రితం రామ్ గోపాల్ వర్మ ఏపీ సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు.


ఆ భేటీ అయిన అనంతరం తాను వైఎస్ జగన్ జీవితానికి సంబంధించి రెండు సినిమాలు చేయబోతున్నానని ప్రకటించారు. దీంతో అందరూ అది వైఎస్ జగన్ బయోపిక్ సినిమా అని అందరూ అనుకున్నారు. కానీ అవి బయోపిక్ సినిమాలు కావని కేవలం వైఎస్ మరణం తర్వాత ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకున్నాయి అనే విషయం మీద సినిమా చేస్తున్నానని ప్రకటించారు.


అయితే జన సైనికులు మాత్రం వైఎస్ జగన్ కోసమే రామ్ గోపాల్ వర్మ పని చేస్తున్నారని కావాలనే పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే విధంగా కామెంట్లు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మొత్తం మీద ఈ అంశం మాత్రం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూనే వస్తోంది. రామ్ గోపాల్ వర్మ కూడా వదలకుండా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. చూడాలి మరి ఈ వివాదం ఎంత దూరం వెళుతుంది అనేది.
Also Read: Srinivasa Murthy Death: శ్రీనివాసమూర్తి గుండెపోటుతో చనిపోలేదా.. పైనుంచి కింద పడి చనిపోయాడా?


Also Read: Nandamuri Taraka Ratna Health: అత్యంత విషమంగా తారక రత్న ఆరోగ్య పరిస్థితి.. బులెటిన్లో ఏముందంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook