Truth Behind Srinivasa Murthy Death: సినీ పరిశ్రమలో వరుస విషాదాలు నెలకొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ జమున అనారోగ్య కారణాలతో కన్నుమూయగా డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి గుండెపోటుతో మృతి చెందినట్లు నిన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అజిత్, విక్రమ్, సూర్య, మోహన్ లాల్ వంటి ఇతర బాషల స్టార్ హీరోలకు డబ్బింగ్ చెప్పి ఆయన తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఒకానొక సమయంలో ఆయన ఎవరో కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేదు కానీ యూట్యూబ్ ఛానల్స్ విరివిగా పెరిగిపోయిన తర్వాత ఆయన ఇంటర్వ్యూల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.
అయితే ఆయన తన నివాసంలో కార్డియాక్ అరెస్ట్ కావడం వల్ల మరణించినట్లు ప్రచారం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే అది నిజం కాదని సినీ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ రవిశంకర్ పేర్కొన్నారు. ప్రముఖ హీరో సాయికుమార్ సోదరుడైన ఆయన తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా మంచి క్రేజ్ అందుకున్నారు. అయితే నిన్న శ్రీనివాసమూర్తి పార్థివ దేహాన్ని సందర్శించేందుకు వెళ్లిన ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా శ్రీనివాస్ మూర్తి హార్ట్ ఎటాక్ వల్ల చనిపోలేదని అన్నారు. రెండంతస్తుల మేడలో రెండవ అంతస్తు నుంచి ఆయన పడిపోయి చనిపోయారని వెల్లడించారు.
సాధారణంగా ఆయన ప్రతిరోజూ 500 రూపాయలకు తగిన పూలు కొనుక్కుని దేవుళ్లను అందరిని పూజించి అప్పుడు బయలుదేరుతారని కానీ నిన్న తన ఇంటి బాల్కనీలో పెట్టిన ఒక పూల మొక్క నుంచి పూలు తెంపేందుకు ప్రయత్నిస్తూ పడిపోయినట్లుగా తాను భావిస్తున్నానని అన్నారు. తాను బెంగళూరులో ఉన్న సమయంలో శ్రీనివాసమూర్తి హార్ట్ ఎటాక్ తో చనిపోయినట్లుగా వార్తల్లో చూశానని తాను విన్నదాని ప్రకారం ఆయన మేడ మీద నుంచి పడిపోయారని అన్నారు ఈ రెండు వెర్షన్స్ లో ఏ వెర్షన్ నిజమని తెలుసుకునేందుకు ఇక్కడకు వస్తే ఆయన నిజంగానే మేడ మీద నుంచి పడిపోయి చనిపోయారని తెలిసిందని అన్నారు.
ఇక ఈ సందర్భంగా రవిశంకర్ ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకున్నారు. శ్రీనివాసమూర్తి చాలా మంచి వ్యక్తి అని, దైవభక్తి చాలా ఎక్కువ అని అన్నారు. ఎవరైనా ఒక వ్యక్తి ఒక దేవుడి ఫోటో మరో 2000 రూపాయల నోటు ఇస్తే 2000 రూపాయి నోటు పక్కనపడేసి దేవుడు ఫోటోని జాగ్రత్త చేసుకుంటారని దేవుడంటే ఆయనకి అంత భక్తి అని చెప్పుకొచ్చారు. అయితే మరి నిజానికి శ్రీనివాసమూర్తి ఈ మరణం ఎలా సంభవించిందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన కుటుంబ సభ్యులు లేదా పోలీసులు దీనికి సంబంధించిన ఒక అధికారిక ప్రకటన చేస్తే తప్ప ఆయన మరణం గురించి పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం కనిపించడం లేదు.
Also Read: Urfi Javed Photoshoot : ఆ రెండు ఏంటి? అలా ఉన్నాయ్.. ఉర్ఫీ జావెద్‌ను చూసి మతిపోవాల్సిందేనా?
Also Read: Nandamuri Taraka Ratna Health: అత్యంత విషమంగా తారక రత్న ఆరోగ్య పరిస్థితి.. బులెటిన్లో ఏముందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook