RGV on RRR: ఆర్ఆర్ఆర్, రాజమౌళిపై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు
RGV on RRR: జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నటించిన పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ పై ఆర్జీవీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలిప్పుడు వైరల్ అవుతున్నాయి.
RGV on RRR: జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నటించిన పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ పై ఆర్జీవీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలిప్పుడు వైరల్ అవుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా విడుదలైన భారీ ప్రాజెక్టు సినిమా ఆర్ఆర్ఆర్ దక్షిణాదిన దుమ్ము రేపుతోంది. డివైడెట్ టాక్ ఉన్నా..కలెక్షన్లపరంగా బాగుంది. బాహుబలి దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధానపాత్రల్లో కన్పించనున్నారు. తొలిరోజే 250 కోట్ల కలెక్షన్లతో బాక్సాఫీసు రికార్డు సృష్టించింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా తొలివారం వరకూ ఢోకా ఉండదని తెలుస్తోంది.
ఇక సినీ పరిశ్రమలోని ప్రముఖులు ఈ సినిమాపై కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, అల్లు అర్జున్ వంటి హీరోలు, దర్శక నిర్మాతలు ఆర్ఆర్ఆర్ పై ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో సంచలన, వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాహుబలి సినిమాతో పోలుస్తూ..ఇదొక చారిత్రాత్మకం చిత్రమని ప్రశంసించాడు. అంతేకాకుండా..బాహుబలి 2 అనేది ఓ చరిత్ర..ఆర్ఆర్ఆర్ అనేది చారిత్రాత్మకం..రాజమౌళి..బాక్సాఫీసుకు మోక్షం కల్గించిన గొప్ప వ్యక్తి అని కామెంట్ చేశాడు. ఆర్జీవీ చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Also read: Allu Arjun Car: టాలీవుడ్ సెలెబ్రిటీల కార్లకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల జరిమానా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook