RGV Tweet: ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ దృష్టిలో పెట్టుకుని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నారా లోకేష్, జూనియర్ ఎన్టీఆర్‌లపై చేసిన కామెంట్లు ఆసక్తి రేపుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు లేదా వివాదం రేపే సినిమాలతో ముందుండే దర్శకుడు ఆర్జీవీ (RGV) మరోసారి సంచలనం రేపారు. అంశం ఏదైనా సరే చెంపపెట్టులా విమర్శించడంలో ఆర్జీవిని దాటి ఎవరూ ఉండరు.ట్విట్టర్ సాక్షిగా చేసే కామెంట్లు వైరల్ అవుతుంటాయి. తాజాగా కరోనా వైరస్(Corona virus) దృష్టిలో పెట్టుకుని చేసిన రాజకీయ వ్యాఖ్యలు కొత్త దుమారాన్ని లేపుతున్నాయి. అటు నారా లోకేష్ ఇటు జూనియర్ ఎన్టీఆర్( Junior Ntr)‌ల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్‌పై యధాలాపంగా దుమ్మెత్తిపోసిన ఆర్జీవీ..జూనియర్ ఎన్టీఆర్‌ని మాత్రం మోసేశారు. 


నారా లోకేష్ ( Nara Lokesh) అనే అతిసూక్ష్మ వైరస్ బారిన పడి తెలుగుదేశం (Telugu Desam) దారుణంగా దెబ్బతిన్నదని..ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీని కాపాడాలంటే కేవలం జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యాక్సిన్ వల్లే అవుతుందంటూ రామ్‌గోపాల్ వర్మ ( Ramgopal varma) వ్యాఖ్యానించారు. అందుకే టీడీపీ క్యాడర్ చురుకుగా వ్యవహరించి ఎన్టీఆర్ అనే వ్యాక్సిన్ వేయించుకోవాలని.. లేకపోతే అందరూ చనిపోతారని ట్వీట్ చేశారు. నేను చెప్పేది టీడీపీ కార్యకర్తలందరూ జాగ్రత్తగా వినండి.. చంద్రబాబు, నారా లోకేష్ లాంటి వైరస్ కారణంగానే టీడీపీ పార్టీ కరోనావైరస్ లాంటి వ్యాధికి గురి కావడం జరిగింది. కాబట్టి వెంటనే తారక్ అనే వ్యాక్సిన్ పార్టీకి ఇప్పించండి అంటూ వర్మ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.


ఓ వైపు నారా లోకేష్‌పై విమర్శనాస్థ్రాలు సంధించిన రామ్ గోపాల్ వర్మ..చంద్రబాబు నాయుడికి ( Chandrababu naidu) జన్మదిన శుభాకాంక్షలు అందించారు. ఏపీ ఉన్నంత కాలం చంద్రబాబు ఉండాలని..రెండింటినీ విడదీసి చూడలేనని వర్మ మరో ట్వీట్ చేశారు.


Also read: Rama Navami 2021 Wishes: అందరికీ రామనవమి శుభాకాంక్షలు తెలిపిన Ramayanam సీతారాములు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook