Rama Navami 2021 Wishes: అందరికీ రామనవమి శుభాకాంక్షలు తెలిపిన Ramayanam సీతారాములు

Rama Navami 2021 Wishes: Ramayans Rama and Sita, Arun Govil and Dipika Chikhlia wish fans on Rama Navami: రామనవమి శుభాకాంక్షలు తెలిపిన Ramayanam సీతారాములు

Written by - Shankar Dukanam | Last Updated : Apr 21, 2021, 11:31 AM IST
Rama Navami 2021 Wishes: అందరికీ రామనవమి శుభాకాంక్షలు తెలిపిన Ramayanam సీతారాములు

 

శ్రీ మహా విష్ణువు త్రేతాయుగంలో రాముడిగా అవతరించాడు. వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో త్రేతాయుగంలో శ్రీరాముడు జన్మించాడు. నేడు శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు. పద్నాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము అనంతరం శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. అది కూడా సరిగ్గా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని నమ్ముతారు. శ్రీ సీతారాముల కళ్యాణం సైతం ఈరోజునే జరిగింది. తెలుగు ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.

నేడు (ఏప్రిల్ 21న) శ్రీరామనవమి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. రామానంద సాగర్ తీసిన రామాయణం సుప్రసిద్ధి చెందింది. ఆ రామాయణంలో సీతారాములుగా కనిపించిన అరుణ్ గోవిల్, దీపికా చిక్లియా టోపీవాలాలు దేశ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియాలో పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు.

Also Read: Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 21, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి ధనవ్యయం

‘ప్రపంచానికి మానవత్వం, మంచి విధానాలను ఎవరు బోధించారు, వాగ్దానం మరియు గౌరవం మీద జీవితాన్ని కొనసాగించడం, ప్రజలకు సంక్షేమం అందించడం, నిజమైన భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించేవారు రాముడు. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు’ అని అరుణ్ గోవిల్ ట్వీట్ చేశారు.

‘శ్రీ రామ్‌చంద్ర కృపాలూ భజ్
మన హరన్ భవభయ్ దారుణమ్|
నవకంజ్ లోచన్, కంజ్ ముఖ్,
కర్ కంజ్, పద్ కంజారుణం |
-రామ నవమి శుభాకాంక్షలు’ అని రామయణం సీరియల్‌లో సీత పాత్ర పోషించిన నటి దీపికా చిక్లియా టోపీవాలా తన విషెస్ తెలిపారు. 

Also Read: Marriage Luck: ఈ రాశులలో జన్మించిన అమ్మాయిలకు పెళ్లి తరువాత సిరిసంపదలు, సుఖశాంతులు! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News