KCPD Movie Update కేసీపీడీ KCPD (కొంచెం చూసి ప్రేమించు డ్యూడ్ ) చిత్రం నుంచి కొన్ని పోస్టర్లను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. యంగ్ అండ్ డైనమిక్ హీరో రామిడి శ్రీరామ్ బర్త్ డే సందర్భంగా కొన్ని పోస్టర్లను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పోస్టర్లో చాలా రోజులకు తనీష్‌ కొత్తగా, స్టైలీష్‌గా కనిపించాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రామిడి శ్రీరామ్, తనీష్,ద్వారక విడియన్ (బంటి) కాంబోలో కేసీపీడీ చిత్రం రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రియాంక నిర్వాణ,దివ్య డిచోల్కర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కార్తీక్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.


హీరో రామిడి శ్రీరామ్ పుట్టిన రోజు సందర్బంగా మూవీ నుంచి రొమాంటిక్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. హీరో రామిడి శ్రీరామ్ పుట్టినరోజు వేడుకలను చిత్రయూనిట్ ఘనంగా జరిపించింది. ఈ సందర్భంగా నిర్మాత కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ.. రామిడి శ్రీరామ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 


[[{"fid":"266186","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


మొదటి  షెడ్యూల్ జరుపుకుంటోందని, ఈ సినిమా కథ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని చెప్పుకొచ్చాడు. అందరూ కుటుంబ సభ్యుల్లా కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. వ్యాలంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుందని, రానున్న రోజుల్లో మరిన్ని అప్డేట్లు వదలబోతోన్నట్టుగా ప్రకటించారు. ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేసే మంచి కథతో వస్తున్న తమకు ఆడియెన్స్ నుంచి సపోర్ట్ లభిస్తుందని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశాడు.


Also Read:  Allu Arjun Telugu Pride : బన్నీ పెట్టిన మంట.. ట్విట్టర్‌లో ఫ్యాన్ వార్.. రెచ్చిపోతోన్న మెగా, నందమూరి ఫ్యాన్స్


Also Read: Anasuya Bharadwaj Family : ఫ్యామిలీతో కలిసి చిల్.. వీకెండ్‌లో అనసూయ సందడి.. పిక్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook