BiggBoss 5 Telugu Grand Finale: అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 మరి కొద్దిరోజుల్లో ముగియబోతోంది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ ఫినాలేకు రంగం సిద్ధమౌతోంది. ఈసారి గ్రాండ్ ఫినాలే అతిధులెవరో తెలుసా.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ ఫినాలేకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఇంకా ఐదు రోజులు మాత్రమే మిగిలింది. 15వ వారం అంటే చివరి వారంలో ప్రవేశించిన బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 టైటిల్ విజేత ఎవరనేది వచ్చే ఆదివారం తేలనుంది. ఇప్పటికే గత 15 వారాల్నించి ప్రేక్షకులకు బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్న ఈ అతిపెద్ద రియాల్టీ షోలో టాప్ 5 కంటెస్టెంట్లుగా నిలిచినవారిలో ఉత్కంఠ పెరిగింది. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో(BiggBoss House)శ్రీరామచంద్ర, మానస,సన్నీ, షణ్ముఖ్, సిరి మిగిలారు. ఈ ఐదుగురిలో విన్నర్ ఎవరనేది డిసెంబర్ 19 న తేలిపోతుంది. తొలి ఫైనలిస్ట్‌గా శ్రీరామచంద్ర..ఫినాలే పోటీ ఆధారంగా చేరగా మిగిలిన కంటెస్టెంట్లు ఓటింగ్ ఆధారంగా టాప్ 5లో నిలిచారు. సెకండ్ ఫైనలిస్ట్‌గా సన్నీ, థర్డ్ ఫైనలిస్ట్‌గా సిరి, ఫోర్త్ పైనలిస్ట్‌గా షణ్ముఖ్, ఐదవ ఫైనలిస్ట్‌గా మానస్ నిలిచారు. 


డిసెంబర్ 19న జరగనున్న గ్రాండ్ ఫినాలేకు(BiggBoss Grand Finale) రంగం సిద్ధమౌతోంది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ ఫినాలేను మరింత వైభవంగా నిర్వహించేందుకు బిగ్‌బాస్ యాజమాన్యం నిర్ణయించింది. అందుకే ఈసారి ముఖ్య అతిధులుగా టాలీవుడ్ నుంచి కాకుండా బాలీవుడ్ నుంచి కీలక నటులు హాజరయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ అగ్రనటుడు రణ్‌వీర్ సింగ్(Ranveer Singh), అగ్ర నటీమణులు దీపికా పదుకోన్(Dipika Padukone), అలియా భట్‌లు(Alia Bhatt)గ్రాండ్ ఫినాలే అతిధులుగా రానున్నట్టు సమాచారం. మరోవైపు రామ్‌చరణ్‌తో(Ramcharan)పాటు ఆర్ఆర్ఆర్ టీమ్(RRR Team)కూడా సందడి చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా ధృవీకరణ రాలేదు. బిగ్‌బాస్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రతిపాదిత పేర్లలో ఒకరిద్దరు మిస్సయినా..కచ్చితంగా బాలీవుడ్ నటులే అతిధులుగా ఉండవచ్చని తెలుస్తోంది. 


Also read: Samantha: సమంతకు అస్వస్థత.. క్లారిటీ ఇచ్చిన సామ్ మేనేజర్..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి