Samantha: సమంతకు అస్వస్థత.. క్లారిటీ ఇచ్చిన సామ్ మేనేజర్..!

Samantha: సినీ నటి సమంత అస్వస్థతకు గురయ్యారు. ఆమె తీవ్ర తలనొప్పి, వైరల్ ఫీవర్, జలుబుతో బాధపడుతున్నారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 13, 2021, 04:06 PM IST
Samantha: సమంతకు అస్వస్థత.. క్లారిటీ ఇచ్చిన సామ్ మేనేజర్..!

Samantha Health news: సినీనటి సమంత(Samantha) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.  ఆదివారం కడప పర్యటన ముగించుకుని హైదరాబాద్(Hyderabad)​కు చేరుకున్న కొన్ని గంటల్లోనే ఆమె అనారోగ్యం పాలయ్యారు. తీవ్రమైన జలుబు, వైరల్ ఫీవర్​తో ఆమె బాధపడుతున్నట్టు తెలుస్తోంది. సోమవారం హైదరాబాద్​లోని ఏఐజీ అసుపత్రికి వెళ్లి సమంత పరీక్షలు చేయించుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం తన ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు.  గత కొన్ని రోజులుగా తిరుపతి, శ్రీకాళహస్తి, కడప సహా పలు ప్రాంతాల్లో  పర్యటించారు సమంత.

Also Read: Actress Samantha: కడపలో సమంత సందడి...భారీగా తరలివచ్చిన జనం

కాగా సమంత పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని.. సోషల్ మీడియా(Social Media)లో వచ్చే అసత్య వార్తలను నమ్మవద్దని సమంత మేనేజర్ మహేంద్ర తెలిపారు. సమంత నిన్న కడపలో సందడి చేశారు. అక్కడ ఒక షోరూం ప్రారంభోత్సవానికి వెళ్లారు. సమంతను చూసేందుకు వేల సంఖ్యలో జనం గుమికూడారు. కడప(Kadapa) నుంచి వచ్చిన అనంతరం సమంత అస్వస్థతకు గురయ్యారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News