Rashmika Mandanna Comments on Kannada industry Ban : హీరోహీరోయిన్ల మీద బ్యాన్ విధించడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అదీ టాప్ రేంజ్‌లో దూసుకుపోతూ నేషనల్ వైడ్‌గా క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ల మీద బ్యాన్ వేయడానికి ఎవ్వరూ ముందుకు రారు. అలా కన్నడ పరిశ్రమ రష్మిక మీద బ్యాన్ వేసిందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతూనే వచ్చాయి. రక్షిత్ శెట్టి చార్లి, రిషభ్ శెట్టి కాంతారా సినిమాల మీద రష్మిక స్పందించలేదు. కాంతారా సినిమాను చూడలేదు అంటూ రష్మిక చెప్పింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ మాటలు వివాదానికి దారి తీశాయి. మరో సందర్భంలో తన ఫస్ట్ ప్రొడక్షన్ కంపెనీ పేరు చెప్పేందుకు కూడా రష్మికకు మనసు రాలేదు. దీంతో రిషభ్ శెట్టి కూడా కౌంటర్లు వేశాడు. అలా ఈ వివాదం చిలికి చిలికి గాలి వానలా మారింది. చివరకు రష్మికను బ్యాన్ చేశారంటూ వార్తలు కూడా వచ్చాయి. దీనిపై రష్మిక స్పందించింది. ఇక రిషభ్ శెట్టి, రక్షిత్ శెట్టిలతో రిలేషన్ ఎలా ఉందో కూడా చెప్పేసింది. నాకు వారి పట్ల అయితే ప్రేమే ఉంది.. ఆ వివాదం మీద ఎలా స్పందించాలి..ఏం చెప్పాలో తెలియడం లేదు.. ఇది వారికే వదిలేస్తున్నాను అంటూ ట్రోలింగ్ మీద స్పందించింది.


కాంతారా వివాదం మీద కూడా రష్మిక స్పందించింది. విడుదలైన రెండు మూడు రోజుల్లోనే సినిమాను చూశారా? అని అడిగారు.. నేను అప్పటికి చూడలేదు.. అదే విషయాన్ని చెప్పాను.. ఈ మధ్యే సినిమాను చూశా.. బాగుందని టీంకు మెసెజ్ పెట్టా.. థాంక్యూ అని అటు నుంచి రిప్లై కూడా వచ్చింది.. అంటూ రష్మిక చెప్పుకొచ్చింది. ఇక బయటి ప్రపంచానికి లోపల ఏం జరుగుతుందో తెలియదు.. నేను మా పర్సనల్ లైఫ్‌ మీద వచ్చే కామెంట్ల కంటే.. ప్రొఫెషనల్ లైఫ్ మీద వచ్చే కామెంట్లను పట్టించుకుంటాను..ఇప్పటికైతే నా మీద బ్యాన్ వేయలేదు అంటూ రష్మిక క్లారిటీ ఇచ్చింది.


Also Read : Manchu Lakshmi: లెస్బియన్ పాత్రలో మంచు లక్ష్మి, లిప్‌లాక్స్, హాట్ హగ్స్‌తో కేక, వైరల్ అవుతున్న సీన్స్


Also Read : Anupama Parameswaran: అక్కడ టాటూతో అనుపమ పరమేశ్వర్ రచ్చ.. లేటెస్ట్ పిక్స్ వైరల్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook