Manchu Lakshmi: లెస్బియన్ పాత్రలో మంచు లక్ష్మి, లిప్‌లాక్స్, హాట్ హగ్స్‌తో కేక, వైరల్ అవుతున్న సీన్స్

Manchu Lakshmi: టాలీవుడ్ విలక్షణ నటుడు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి తన వ్యాఖ్యలతో తరచూ సంచలనమౌతుంటుంది. ఈసారి ఓ సినిమా విషయమై చర్చనీయాంశమౌతోంది. ఆ వివరాలు మీ కోసం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 8, 2022, 07:51 PM IST
Manchu Lakshmi: లెస్బియన్ పాత్రలో మంచు లక్ష్మి, లిప్‌లాక్స్, హాట్ హగ్స్‌తో కేక, వైరల్ అవుతున్న సీన్స్

సినిమాల్లో నిలదొక్కుకోవాలంటే చాలా శ్రమపడాల్సి వస్తుంది. ఎలాంటి పాత్రనైనా పోషించగలగాలి. అదే సమయంలో వివాదాస్పద పాత్రలు పోషిస్తే గుర్తింపు సంగతెలా ఉన్నా..వివాదం రాజుకుంటుంది. ఇప్పుడు మంచు లక్ష్మి పరిస్థితి అదే.

మోహన్ బాబు తనయగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మంచు లక్ష్మి నటనతో పాటు దర్శకత్వ బాధ్యతలు, నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకుంది. నటిగా చేసిన సినిమాలు అంతగా పేరు ప్రఖ్యాతులు సాధించలేకపోయాయి. బహుశా అందుకేనేమో ఈసారి మంచు లక్ష్మి ఏకంగా లెస్బియన్ పాత్రలో హల్‌చల్ చేసింది. లిప్‌లాక్‌లతో కేక పుట్టించింది. మలయాళ నటుడు మోహన్‌లాల్ నటించిన మాన్‌స్టర్ సినిమాలో ఏకంగా లెస్బియన్ పాత్రతో అందర్నీ మెప్పించినా..విమర్శలు కూడా ఎదుర్కొంటోంది. ఇప్పటివరకూ వివిధ పాత్రల్లో కన్పించిన మంచు లక్ష్మి ఈ సినిమాలో లెస్బియన్‌గా మంత్రముగ్దుల్ని చేసిందని చెప్పవచ్చు. స్క్రీన్ స్పేస్ తక్కువే అయినా అందర్నీ మెప్పించగలిగింది.

మాన్‌స్టర్ సినిమాలో సహ నటి హనీ రోజ్‌తో మంచు లక్ష్మి లిప్‌లాక్, హగ్ సీన్స్ వైరల్ అవుతున్నాయి. ఎప్పుడూ సోషల్ మీడియా ట్రోల్స్ బారినపడుతుంటే మంచు లక్ష్మి పాత్రపై ఇప్పుడు మరింతగా ట్రోలింగ్ నడుస్తోంది. అదే సమయంలో నటిగా ఛాలెంజింగ్ పాత్ర పోషించిందంటూ ప్రశంసించే నెటిజన్లు కూడా ఉన్నారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకోవడం విశేషం.

Also read: Honey Rose Hot Pics: హనీ రోజ్ హాట్ ట్రీట్.. అందానికే అసూయ పుట్టేలా ఉందిగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News