Rashmika Mandanna Alert: నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్ది.. రష్మిక జాగ్రత్తగా మాట్లాడకుంటే ఇబ్బందే!
Rashmika Mandanna Alert On Interviews: నేషనల్ క్రష్ గా పిలిపించుకున్న ఈ భామ నేషనల్ కాంట్రవర్షియల్ సెలబ్రిటీ అయిపోతుందా అని కూడా ఆశ్చర్యం వేసే పరిస్థితుల్లో ఆమె ఏ మాట మాట్లాడినా అది కాంట్రవర్సీ అవుతున్న క్రమంలో రష్మిక జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.
Rashmika Mandanna Cautious: రష్మిక మందన్న హీరోయిన్ గా ఇప్పుడు కేవలం తెలుగు భాషలో కాదు బాలీవుడ్లో సైతం దూసుకుపోతోంది. పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఒప్పుకుంటూ టాప్ హీరోల సరసన కనిపిస్తోంది. అలాంటి భామ నితిన్ సరసన కనిపిస్తుందని ఎవరూ ఊహించలేదు కానీ భీష్మ కాంబినేషన్ ని మళ్లీ రిపీట్ చేస్తూ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ అయ్యింది. ఈ రోజు ఆ ప్రాజెక్టుని చిరంజీవి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు కూడా.
అయితే ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియో ఒకటి ఆసక్తి రేపింది. ముందుగా నితిన్ రావడం తర్వాత రష్మిక మందన్న రావడం జీవి ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నారని విధంగా హింట్ ఇవ్వడం తర్వాత వెంకీ కుడుముల రావడం ఇలా ఒక కొత్త స్టైల్ లో ఈ సినిమాని అనౌన్స్ చేశారు. అయితే ఈ అనౌన్స్మెంట్ వీడియోలో రష్మిక మాట్లాడిన ఒక మాట మాత్రం ఇప్పుడు చర్చకు దారి తీసింది. అదేమిటంటే తాను ఈ మధ్య ఏం మాట్లాడినా కాంట్రవర్సీ అయిపోతుందంటూ ఆమె కామెంట్ చేసింది.
అందుకే తన ఏం మాట్లాడాలన్నా జాగ్రత్తగా ఆలోచించుకుని మాట్లాడాల్సి వస్తోందని ఆమె చెప్పుకొచ్చింది. రష్మిక మందన్న కావాలని కామెంట్లు చేస్తుందో లేక ఆమె చేస్తున్న కామెంట్లను వివాదాలుగా మారుస్తున్నారో తెలియదు కానీ రిషబ్ శెట్టి కాంతార మొదలు సౌత్ సినిమాల మీద ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయం వరకు అనేక విషయాలు రాద్ధాంతం చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే రష్మికలో రియలైజేషన్ కనిపిస్తోందని అంటున్నారు.
ఒకరకంగా నేషనల్ క్రష్ గా పిలిపించుకున్న ఈ భామ నేషనల్ కాంట్రవర్షియల్ సెలబ్రిటీ అయిపోతుందా అని కూడా ఆశ్చర్యం వేసే పరిస్థితుల్లో ఆమె ఏ మాట మాట్లాడినా అది కాంట్రవర్సీ అవుతూ వచ్చింది. నిజానికి ఆమె మాట్లాడిన ప్రతి విషయాన్ని వేరే అంశాలతో ముడి పెడుతూ వాటిని వివాదాలు చేస్తూ వచ్చారని ఆమె చెబుతోంది. అలాగే సక్సెస్ను మార్కెటింగ్ చేసుకోవడం కూడా తనకు బాగా వచ్చని ధీమాతో ఉంది. ఈ భామ ఇకమీదటైనా అనవసరమైన కాంట్రవర్సీల జోలికి వెళ్లకుండా తన పని ఏదో తాను చేసుకుంటూ వెళితే హీరోయిన్ గా నాలుగు కాలాలపాటు కొనసాగవచ్చని విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. చూడాలి మరి ఏమవుతుంది అనేది.
Also Read: Manchu Manoj Tweet: పొద్దున్న అన్నతో గొడవ.. బాధగా ఉందంటూ మంచు మనోజ్ ట్వీట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook