Naresh Clarity on Fourth Marriage: చాలాకాలం నుంచి జరుగుతున్న నరేష్ పవిత్ర వివాహానికి సంబంధించిన ప్రచారానికి ఎట్టకేలకు బ్రేకులు పడ్డాయి. వీరిద్దరూ ఒక సినిమాలో కలిసి నటించబోతున్నట్లుగా ఒక ప్రచారం జరగగా కాదు మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారని మరో ప్రచారం జరిగింది. కానీ ఎట్టకేలకు నరేష్ తాను పవిత్ర లోకేష్ కలిసి నటిస్తున్న సినిమాకి సంబంధించిన పోస్టర్ ని సోషల్ మీడియాలో విడుదల చేశారు. విజయ్ కృష్ణ మూవీస్ బ్యానర్ మీద నరేష్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాని ఒకప్పటి నిర్మాత ఎమ్మెస్ రాజు స్వయంగా రాసి డైరెక్ట్ చేస్తున్నారు.
ఈ సినిమాకి మళ్లీ పెళ్లి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక తాజాగా పోస్టర్ విడుదల చేయగా పోస్టర్లో పవిత్ర ముగ్గు పెడుతున్నట్టుగా కనిపిస్తుండగా వైట్ డ్రెస్ లో ఉన్న నరేష్ ఆమె ముగ్గు వేస్తున్న క్రమంలో పక్కన కూర్చుని చూస్తూ ఉండటం కనిపిస్తుంది. ఈ సినిమాని తెలుగుతో పాటు కన్నడ భాషలో కూడా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. వాస్తవానికి పవిత్ర లోకేష్ కన్నడ నాట మంచి మార్కెట్ ఉంది. ఆమె గతంలో కన్నడలో పలు సినిమాల్లో హీరోయిన్స్ గా కూడా నటించింది.
ఈ నేపథ్యంలో ఈ సినిమాని తెలుగు సహా కన్నడ భాషలో కూడా రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే కన్నడ బాషలో ఉన్న పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇక నరేష్ పవిత్ర మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారానికి ఈ విధంగా బ్రేకులు పడ్డాయి నిజానికి నరేష్ మూడో భార్య రమ్య రఘుపతితో ఇప్పటికీ ఆయనకి విడాకులు కాలేదు. ఈ నేపథ్యంలో నాలుగో పెళ్లి అనే ప్రచారం ప్రచారానికే పరిమితం అవ్వవచ్చని ఆయన సినిమా లేదా వెబ్ సిరీస్ ప్రమోషన్ అనే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.
ఇప్పుడు ఫైనల్ గా దాన్ని నిజం చేస్తూ నరేష్ తన సోషల్ మీడియా వేదికగా సదరు పోస్టర్లను విడుదల చేశారు. దీంతో నరేష్ నాలుగో పెళ్లి పవిత్ర లోకేష్ ఇద్దరి పెళ్లి జరిగిపోయింది అంటూ జరిగిన ప్రచారానికి బ్రేకులు పడ్డాయి. ఇక ఈ మధ్యకాలంలో వారిద్దరి మధ్య పెళ్లి జరిగినట్లుగా ఏడు అడుగులు వేస్తున్నట్లు రిలీజ్ చేసిన వీడియో కూడా ఈ సినిమాకి సంబంధించిందే అనే క్లారిటీ వచ్చినట్టు అయింది.
Also Read: Balagam OTT Release: బలగం ఓటీటీలోకి వచ్చేస్తోంది.. ఎందులో? ఎప్పుడు వస్తుందంటే?
Also Read: Kola Guruvulu : అనూహ్యంగా ఓడిన కోలా గురువులు.. చివరి నిముషంలో గెలిచిన జయమంగళ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook