Tiger Nageswara Rao Trailer: మాస్ మహారాజా రవితేజ టైటిల్ రోల్ లో నటిస్తున్న చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు'. పాన్ ఇండియాల్లో తెరకెక్కుతున్న ఈ మూవీకి యువ దర్శకుడు వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇండియాలో అతి పెద్ద గజదొంగగా పేరుగాంచిన స్టువర్టుపురం టైగర్ నాగేశ్వరరావు జీవితకథ ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది. నాగేశ్వరరావు పాత్రలో రవితేజ కనిపించనున్నాడు. ఇందులో రవితేజకు జోడిగా కృతిసనన్ సోదరి నుపుర్ సనన్ నటించింది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ మూవీపై వీర లెవల్లో అంచనాలను పెంచేశాయి. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అక్టోబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ మూవీ ట్రైలర్ ను ఐదు భాషల్లో రిలీజ్ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్టువర్టుపురంలో దొంగతనాలు చేసే ప్రదేశాల కోసం వేసే వేలంపాటతో టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ మొదవుతోంది. ఆ తర్వాత రవితేజ యాక్షన్ ధమాకా స్టార్ అవుతోంది. యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్స్ తో ట్రైలర్ మెుత్తం నిండిపోయింది. పోలీసులు చెప్పి మరి ట్రైన్ దోపిడి చేస్తాడు టైగర్ నాగేశ్వరరావు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌ పాత్రలో అనుపమ్ ఖేర్ నటించారు. ‘'మగజాతి మొత్తం.. కొలతలే చూస్తారు.. కాకపోతే అనుభూతి, ఆరాధన అని బూతులు మాట్లాడతారు''’ అంటూ హీరోయిన్‍‍తో రవితేజ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. స్టువర్టుపురంలో దొంగల బెండు తీసే క్యారెక్టర్ లో జిస్సు సెంగుప్త నటించాడు. ఆ తర్వాత రవితేజకు జైలుకు వెళ్లడాన్ని చూపిస్తారు. స్టువర్టుపురం నాగేశ్వరరావు కథ ముగిసిందని అయితే.. టైగర్ నాగేశ్వర రావు కథ అక్కడే మొదలైందని మురళీ శర్మ చెప్పే డైలాగ్ గూస్ బంప్స్ తెపిస్తుంది. ఇందులో రేణు దేశాయ్ కూడా పవర్ పుల్ పాత్రను పోషించింది. 



Also Read: OMG 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న అక్ష‌య్‌కుమార్ 'ఓ మై గాడ్ 2' మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook