Bigg Boss 7 Telugu TRP Rating: బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు ఊహించని టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతుంది. ఈ సీజన్ లో బిగ్ బాస్ షోకి అదిరిపోయే టీఆర్పీ రేటింగ్ వచ్చినట్లు స్టార్ మా ఛానెల్ గురువారం ( సెప్టెంబరు 14)న వెల్లడించింది. అంతేకాకుండా ఇప్పటివరకు ఉన్న రికార్డులన్నీ తిరగరాసినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న రియాల్టీ షో రికార్డులను తెలుగు బిగ్ బాస్ తిరగరాసింది. అత్యధిక టీవీఆర్ 18.1 సాధించినట్లు స్టార్ మా ఛానెల్ ట్వీట్ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరు ఈ షోను చూస్తున్నారు. దాదాపు 5. 1 కోట్ల మంది తొలి వారం బిగ్ బాస్ షో చూశారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత సీజన్లతో పోలిస్తే ఈ సారి 40 శాతం ఎక్కువగా రేటింగ్ ను నమోదు చేసింది బిగ్ బాస్. సెప్టెంబర్ 3న ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 7 ఆవిష్కరణ కార్యక్రమాన్ని సుమారు 3 కోట్ల మంది వీక్షించారు. 



Also Read: Bhola Shankar in OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి ‘భోళాశంకర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?


ఈసారి తెలుగు బిగ్ బాస్ 7 హౌస్ లోకి 14 మంది కంటెస్టెంట్లు వెళ్లారు. గత సీజన్లతో పోలిస్తే ఈసారి బిగ్ బాస్ షో ను డిఫరెంట్ గా ఫ్లాన్ చేశారు మేకర్స్. సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి షోకు ఊహించని రెస్పాన్స్ వస్తుంది. తొలి వారం కిరణ్ రాథోడ్ మెుదటి కంటెస్టెంట్ గా ఎలిమినేట్ అయిపోయింది. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7 రెండో వారం నడుస్తోంది. ఈసారి 9 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. అయితే ఈసారి నామినేషన్లలో ఉన్న కంటెస్టెంట్లలో  అత్యధిక ఓట్లతో పల్లవి ప్రశాంత్, హీరో శివాజీ, అమర్ దీప్ చౌదరి తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. తక్కువ ఓటింగ్ తో షకీల, టేస్టీ తేజ చివరి స్థానాల్లో కొనసాగుతున్నారు. 


Also Read: Rio Kapadia: బాలీవుడ్ లో విషాదం.. చక్‌ దే ఇండియా నటుడు కన్నుమూత



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook