Rio Kapadia: బాలీవుడ్ లో విషాదం.. చక్‌ దే ఇండియా నటుడు కన్నుమూత

Rio Kapadia: సీనియర్ బాలీవుడ్ నటుడు రియో ​​కపాడియా (66) ఇవాళ కన్నుమూశారు. చక్‌ దే ఇండియా సినిమాతో ఈయన బాగా పాపులర్ అయ్యాడు. ఆయన మరణవార్తను సన్నిహితులు ధృవీకరించారు.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 14, 2023, 07:28 PM IST
Rio Kapadia: బాలీవుడ్ లో విషాదం.. చక్‌ దే ఇండియా నటుడు కన్నుమూత

Rio Kapadia death: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బాలీవుడ్ నటుడు రియో ​​కపాడియా (66) కన్నుమూశాడు. ఆయన గురువారం తుదిశ్వాస విడిచినట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు. రియో అనేక బాలీవుడ్ హిట్ చిత్రాల్లో నటించాడు. చక్ దే ఇండియా, దిల్ చాహ్తా హై, హ్యాపీ న్యూ ఇయర్’  మరియు మర్దానీ వంటి చిత్రాల ద్వారా రియో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన మరణ వార్త విన్న సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా ద్వారా సంతాపం ప్రకటిస్తున్నారు. ఇతడికి  భార్య మరియా ఫరా, పిల్లలు అమన్ మరియు వీర్ ఉన్నారు. నటుడు రియో ​​కపాడియా అంత్యక్రియలు సెప్టెంబర్ 15న గోరేగావ్‌లోని శివ్ ధామ్ శంషన్ భూమిలో జరగనున్నాయి. రియో మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

రియో టెలివిజన్ షో సప్నే సుహానే లడక్‌పాన్ కేలో కూడా కనిపించారు. ఈయన సిద్ధార్థ్ తివారి తీసిన మహాభారతంలో గాంధార రాజు అయన సుబలుడి పాత్రను పోషించాడు. ఈయన సినీ పరిశ్రమలో నటులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడాడు. ఇతడు బాలీవుడ్ లో బీర్బల్‌ (Birbal)గా ప్రసిద్ధి చెందాడు. షోలే ఫేమ్ సతీందర్ కుమార్ ఖోస్లా (Satinder Kumar Khosla) మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. 

ప్రముఖ నిర్మాత కన్నుమూత

ఇవాళ టాలీవుడ్ ప్రముఖ నిర్మాత గోగినేని ప్రసాద్ కూడా కన్నుమూశారు. ఈయన తెలుగులో చాలా హిట్ చిత్రాలు నిర్మించాడు. 'ఈ చరిత్ర ఏ సిరాతో', 'శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం' వంటి చిత్రాలతో పాటు నందమూరి బాలకృష్ణతో 'పల్నాటి పులి' సినిమాని కూడా నిర్మించారు. గత కొన్ని రోజులగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. 

Also Read: Bhola Shankar in OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి ‘భోళాశంకర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News