Bhola Shankar in OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి ‘భోళాశంకర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Bhola Shankar Movie: మెగాస్టార్ చిరంజీవి-మోహర్ రమేశ్ కాంబోలో తెరకెక్కిన భోళాశంకర్ సినిమా మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ మూవీ ఎక్కడ  చూడొచ్చంటే..  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 14, 2023, 06:33 PM IST
Bhola Shankar in OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి ‘భోళాశంకర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Bhola Shankar ott release date: మెగాస్టార్ చిరంజీవి 2017లో ఖైదీ నెం.150 చిత్రం ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. ఈ సినిమా బాక్సాపీస్ వద్ద మాంచి కలెక్షన్స్ రాబట్టింది. భారీ వ్యయంతో నిర్మించిన సైరా నరహింహరెడ్డి ఆశించిన స్థాయిలో ఆడలేదు. అనంతరం కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చేసిన ఆచార్య బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. మోహనరాజ్ డైరెక్షన్ లో వచ్చిన గాడ్ ఫాదర్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. వాల్తేరు వీరయ్య అయితే బాక్సాఫీస్ రికార్డులను బద్దలుగొట్టింది. వీరయ్య సినిమా తర్వాత మెగాస్టార్ నటించిన మూవీ భోళా శంకర్.

చాలా ఏళ్లు తర్వాత డైరెక్టర్ మెహర్ రమేశ్ దర్శకత్వం వహించిన సినిమా భోళా శంకర్. మెగాస్టార్ చిరంజీవి, తమన్నా హీరోహీరోయిన్లుగా నటించారు. కీర్తి సురేష్ చిరు చెల్లెలిగా, సుశాంత్ మరో కీలకపాత్రలో నటించాడు. రీసెంట్ గా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.  దీంతో మెహర్ రమేశ్ తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ ఎదుర్కోన్నాడు. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. మరికొన్ని గంటల్లో ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కు రానుంది. సెప్టెంబరు 15 నుంచి ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, భాషల్లో అందుబాటులో తీసుకురానున్నారు. ఈ సినిమాను ఏకే ఎంట్రైటన్మెంట్స్ బ్యానర్ పై అనీల్ సుంకర నిర్మించారు. తమిళంలో బ్లాక్ బాస్టర్ గా నిలిచిన వేదాళం మూవీకి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించారు.

భోళాశంకర్ డిజాస్టర్ తర్వాత తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై మరింత శ్రద్ద తీసుకుంటున్నారు మెగాస్టార్. బంగర్రాజు సినిమాతో సూపర్ హిట్ కొట్టిన కళ్యాణ్ కృష్ణతో ఓ మూవీకి ఓకె చెప్పారు చిరు. మరోవైపు బింబిసార డైరెక్టర్ విశిష్ట దర్శకత్వంలో మూవీ చేయడానికి రెడీ అయ్యాడు చిరంజీవి. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి. త్వరలోనే ఈ రెండు చిత్రాలు పట్టాలెక్కనున్నాయి. 

Also read: Allu Arjun: 'షారుఖ్ మాస్ అవతార్.. జవాన్': అల్లు అర్జున్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News