Akira Nandan Debut: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు మెగా అభిమానులు అందరూ జనసేన భారీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈసారి ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలలో 21 స్థానాల నుంచి పోటీ చేసిన జనసేన 21 స్థానాల్లోనూ గెలిచి విజయ ఢంకా మోగించింది. పిఠాపురం నుంచి పోటీ చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీ ఏం గా ఎంపికయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో మెగా ఇంట ఇప్పటికే వేడుకలు మొదలైపోయాయి. తాజాగా అకీరా నందన్ కూడా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి మరి శుభాకాంక్షలు చెప్పారు. అంతేకాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా తన తండ్రి విజయం గురించి ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ అకీరానందన్ ఎప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 


కానీ అకీరా నందన్ మాత్రం సినిమాల మీద కంటే మ్యూజిక్, ఎడిటింగ్ మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఈ ప్రశ్నలకి రేణు దేశాయి తన సోషల్ మీడియా ఎకౌంటు ద్వారా సమాధానం ఇచ్చారు. అకీరాకి తానే మొదటి ఫ్యాన్ ని అని ఆసక్తికరమైన జవాబు ఇచ్చారు. 


"నన్ను అర్థం చేసుకోండి. అకీరా పుట్టినప్పటినుంచి నేనే తన మొదటి ఫ్యాన్ ని. తను ఎప్పుడు సినిమాల్లోకి వస్తాడు అని నేను కూడా ఎదురుచూస్తున్నాను. కానీ ఒక తల్లిగా నేను తన నిర్ణయానికి కూడా గౌరవం ఇవ్వాలి. అందుకే తను ఎప్పుడు సినిమాల్లోకి వస్తాడు అంటూ నన్ను ఇబ్బంది పెట్టొద్దు ప్లీజ్" అంటూ అకీరాతో ఉన్న ఫోటోని షేర్ చేశారు రేణు దేశాయ్. 


దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కొంత నిరాశ చెందారని చెప్పుకోవాలి. మరికొందరు మాత్రం యాక్టింగ్ కాకపోయినా మ్యూజిక్, ఎడిటింగ్ అంటే అకీరాకి ఎలాగో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ విధంగా అయినా సినిమాల్లోకి వస్తే బాగుంటుంది అంటూ కామెంట్లు చేశారు.


Also read: Richest MP List: దేశంలోనే అత్యంత ధనిక ఎంపీగా గుంటూరు టీడీపీ అభ్యర్ధి పెమ్మసాని చంద్రశేఖర్, టాప్ 6 జాబితా ఇదే



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook