Ukku Satyagraham: విశాఖ ఉక్కు తెలుగు వారి హక్కు నినాదం తో దర్శక, నిర్మాత కమ్ హీరో జనం స్టార్ సత్యారెడ్డి నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. ఈ సినిమాలో  ప్రజా యుద్ధనౌకగా పేరు తెచ్చుకున్న  విప్లవ కవి గద్దర్ నటించారు. ఆయన యాక్ట్ చేసిన చివరి చిత్రం ఇదే కావడం విశేషం. తాజాగాఈ సినిమా కి సంబందించిన విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాని ఈ నెల 29న  విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.  ఈ చిత్రంలో గద్దర్ రెండు పాటలు రాసారు. మూడు పాటలు పాడటం విశేషం. అంతేకాదు కొన్ని  సందేశాత్మక సన్నివేశాల్లో నటించారు. మరోవైపు ఈ చిత్రంలో  గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ మంచి పాటలు అందించారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్ లో దర్శకులు సత్యారెడ్డి మాట్లాడుతూ.. "విప్లవ కవి గద్దర్ అన్న గారు నటించిన చివరి చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’.  ఈ నెల 29 న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు తన పదవి కి తృణప్రాయం గా రాజీనామా చేసిన లక్ష్మి నారాయణ తో పాటు ఎంతో మంది ఉద్యమకారులని నజర్లో పెట్టుకొని ఈ మూవీ కథానాయకుడి పాత్ర గద్దర్ పాత్రను తీర్చిదిద్దారు. ఈ సినిమా నిజ జీవితానికి దగ్గరగా ఉన్న ఉద్యమ చిత్రం అన్నారు.


మాజీ సీబీఐ డైరెక్టర్ ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మి నారాయణ మాట్లాడుతూ.. "ఉక్కు సత్యాగ్రహం చిత్రం ద్వారా, విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఏ విధంగా ప్రయివేటీకరణ చేస్తున్నారనే విషయాన్ని ప్రజలకు ముందుకు తీసుకురాబోతున్నారు. ఇందులో మేధావులు, ప్రజల భాగస్వామ్యాన్ని చూపించబోతున్నాము. సినిమాలో కొన్ని సన్నివేశాలు చూసాను. ఈ చిత్రం స్పూర్తివంతంగా ఉంటుందన్నారు. ఈ సినిమా చూస్తుంటే, ఈ ప్రక్రియ లో మనం కూడ భాగస్వామ్యం కావాలని ఈ సినిమా ప్రమోషన్ కోసం వచ్చినట్టు చెప్పారు.  గద్దర్ కూడా ఈ సినిమా లో నటించడం మంచి విషయమన్నారు. అయన నన్ను లచ్చన్న ఎట్లున్నావ్ అని పలకరించేవారు. అయన స్వయంగా నటించిన సినిమా ఇది. అయన స్ఫూర్తి ని ఈ సినిమా లో చూపించబోతున్నారు. ఈ సినిమా బ్రహ్మాండమైన విజయం సాధించడం గ్యారంటీ అన్నారు.  ఈ సినిమా లో నటించిన అందరికీ విజయం వరించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా దర్శకులు సత్యా రెడ్డికి ప్రత్యేకంగా  నా అభినందనలు తెలియజేస్తున్నాను.


గద్దర్ కూతురు వెన్నెల మాట్లాడుతూ... ఈ రోజు ఉక్కు సత్యాగ్రహం మూవీ విడుదల తేదీ ని అనౌన్స్ చేసేందుకు మీ ముందుకు వచ్చానన్నారు. గద్దర్ అన్న గారు హైదరాబాద్ నుంచి విశాఖ కు బయల్దేరి మళ్ళీ ఇంటికొచ్చే వాళ్ళు. ఈ సినిమా కోసం ఆయన చాలా సమయం కేటాయించిన విషయాన్ని ప్రస్తావించారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ చేయకూడదు అనేది ఆయన ఉద్దేశ్యమన్నారు. ఎవరైతే తమ రక్తం చిందించి స్టీల్ ప్లాంట్ ని డెవలప్ చేసారో, వాళ్ళని కోసం ఈ సినిమా చేసారు గద్దర్. ఆయన ఈ సినిమా లో మా నాన్న గారు నటించినట్టు లేదు. జీవించినట్టు ఉంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నానన్నారు.


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter