రామ్ గోపాల్ వర్మ  ( Ram Gopal Varma ) తాజాగా తెరకెక్కించిన చిత్రం పవర్ స్టార్ ( Powerstar Movie ) ఇవాళ విడుదలైంది. తన సొంత ప్లాట్ఫామ్లో వర్మ ఈ చిత్రాన్ని విడుదల చేశాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) జీవితంలో ఎన్నికల తరువాత ఏం జరిగి ఉంటుంది అనే కథాంశంతో.. ఫార్మ్ హాజ్ సీన్స్ ఎక్కువగా చూపించి మేనేజ్ చేశాడు వర్మ. పవన్ కళ్యాణ్ లక్షణాలు ఉన్న డూప్ పాత్రతో తన కథను నడిపించాడు. ఈ చిత్రం గురించి పవన్ కళ్యాణ్ అభిమానులు అంత సంతోషంగా లేరు అనేది సోషల్ మీడియా ( Social Media ) లో రామ్ గోపాల్ వర్మ పోస్టులకు వారి రిప్లైను బట్టి అర్థం చేసుకోవచ్చు. పైగా పవన్ కళ్యాణ్ అభిమానులకు అంతగా నచ్చని కత్తి మహేష్ (  Kathi Mahesh In Powerstar ) సినిమాలో పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ చేసే పార్ట్ గురించి కూడా నెగెటీవ్ టాక్ వినిపిస్తోంది. ( అనసూయ భరద్వాజ్ అందాలు ఎవర్ Green )


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


అయితే ట్రైలర్ చివరన ఒక వ్యక్తి ఎంటర్ అవడం గురించి సోషల్ మీడియాలో చర్చలు జరిగాయి. ఆ వ్యక్తి ఎవరని చాలా మంది ఎన్నో ఆలోచనలు చేశారు. దీనికి సంబంధించి వర్మనే ఒక క్లారిటీ ఇచ్చి అది తనే అని ట్విట్టర్ వేదికగా తెలిపారు. దాంతో పాటు సినిమా క్లైమాక్స్ లో పవన్ కళ్యాణ్, రామ్ గోపాల్ వర్మ మధ్య సంభాషణ సీన్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో వర్మతో పవన్ కళ్యాణ్ డూప్ ఎన్నో విషయాలపై మాట్లాడుతాడు. దానికి వర్మ సమాధానం ఇస్తాడు. సలహలు కూడా ఇస్తాడు. చివరికి తన ఫిలాసఫికల్ స్టేట్మెంట్ ఇస్తాడు. అన్నింటినీ  అర్థం చేసుకోవడాలని ప్రయత్నించడమే అన్ని సమస్యలకు మూలం అన్నట్టుగా కామెంట్ చేస్తాడు వర్మ. అది విన్న పవన్ కళ్యాణ్ డూప్ క్యారెక్టర్ అక్కడి నుంచి ఎగ్జిట్ అవుతాడు. మొత్తానికి పవన్ కళ్యాణ్ జీవితంలో తనను అలా కల్పితంగా అయినా భాగం చేసుకుని వర్మ సంతోషపడుతున్నాడు అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.


హాట్ భ్యూటీ Sherlyn Chopra ఘాటు ఫోటోలు


Disha Patani: దిశా పటానీ లేటెస్ట్ ఫొటోస్


అందాల నాగిని Mouni Roy Hot Photo Gallery


Payal Ghosh లేటెస్ట్ Hot Photos Gallery