బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య (Sushant Suicide Case) కేసులో పలు ఆశ్చర్యకర విషయాలను ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ (Mumbai Police Commissioner Param Bir Singh) వెల్లడించారు. నటి, సుశాంత్ గాళ్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి ఎక్కడ ఉంటుందో తమకు తెలియదని, అయితే పిలిచినప్పుడల్లా తాను విచారణకు సహకరించిందని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆమె జాడ దొరకడం లేదని ముంబైలో విచారణ ప్రారంభించిన బిహార్ స్పెషల్ పోలీస్ టీమ్ చెబుతోంటే.. ముంబై సీపీ మాత్రం రియా కేసుకు సహకరిస్తుందని చెప్పారు. కరోనాతో భద్రాచలం మాజీ ఎమ్మెల్యే మృతి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సుశాంత్ చనిపోయేముందు రెండు గంటలపాటు ఇంటర్నెట్‌లో తన గురించి వెతికాడని సీపీ పరమ్ బీర్ సింగ్ చెప్పారు. కొన్ని రోజుల ముందు ఆత్మహత్యకు పాల్పడిన తన మాజీ మేనేజర్ దిశా సలియన్‌కు, తనకు లింక్ కథనాలు చూసి తీవ్ర మనస్తాపానికి గురై ఉంటాడని అభిప్రాయపడ్డారు. నొప్పి లేకుండా ఎలా చనిపోతారో తెలుసుకునేందుకు గూగుల్‌లో సుశాంత్ వెతికినట్లు సైతం ఆయన వెల్లడించారు. రియా చక్రవర్తి ఎక్కడుందో మాత్రం తమకు తెలియదని, విచారణకు మాత్రం సహకరించిందంటూ మద్దతు తెలిపేలా వ్యాఖ్యలు చేయడం సుశాంత్ అభిమానుల అనుమాల్ని రెట్టింపు చేస్తోంది. పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే... 


రియా చక్రవర్తి కనిపించడం లేదంటూ బిహార్ పోలీసులు అనడం సరికాదని ఆమె తరఫు లాయర్ సతీష్ హనీషిండే అన్నారు. ముంబై పోలీసులు ఇదివరకే ఆమె వాంగ్మూలం సేకరించారి, పోలీసులు పిలిచినప్పుడల్లా ఆమె స్టేషన్‌కు వెళ్లి వివరాలు తెలుపుతూ సహకరించారని లాయర్ చెబుతున్నారు. బిహార్ పోలీసుల నుంచి రియాకు ఇప్పటివరకూ ఎలాంటి నోటీసులు రాలేదని, కేసు విచారణ చేసే  అధికారం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos