టాలీవుడ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా ఆర్ఆర్ఆర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో పోషిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీకి రాబోతోంది. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ కారణంగా, రామ్ చరణ్, ఎన్టీఆర్‌లకు కరోనా లాంటి పలు కారణాలతో షూటింగ్ పలుమార్లు వాయిదా పడింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజమౌళి మల్టీస్టారర్ అంటే ఏ రేంజ్‌లో ఉంటుందో, అంచనాలు అంతకు మించి ఉంటాయని తెలిసిందే. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, గొండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ సత్తాచాటేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఓవైపు చెర్రీ, ఎన్టీఆర్ కాంబినేషన్, మరోవైపు అగ్రదర్శకుడు రాజమౌళి పనితనం ఆర్ఆర్ఆర్ సినిమా (RRR movie)పై రోజురోజుకూ అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ క్రమంలో మూవీకి సంబంధించి మరో అప్‌డేట్ వచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమాకు డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్‌నర్స్‌గా జీ5, నెట్‌ఫ్లిక్స్ ఉన్నాయి.


Also Read: Mugguru Monagallu Trailer review: ముగ్గురు మొనగాళ్లు ట్రైలర్ రివ్యూ



శాటిలైట్ పార్ట్‌నర్స్‌గా జీ సినిమా, స్టార్ మా తెలుగు, తమిళం, స్టార్ కన్నడ, ఏషియా నెట్ మళయాళం కొనసాగుతున్నాయి. ఇంగ్లీష్ సహా ఇతర విదేశీ భాషలలో డిజిటల్ ప్రసారం హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ డిజిటల్ మరియు శాటిలైట్ పార్ట్‌నర్స్ విషయాన్ని పెన్ స్టూడియోస్ బుధవారం సాయంత్రం ప్రకటించింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ (Jr NTR) ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు డిజిటల్, శాటిలైట్ హక్కులు తమకు అందించినందుకుగానూ దర్శకుడు రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్యకు ఆయా సంస్థల ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు.


Also Read: Jr NTR: కరోనా నుంచి కోలుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook